Pawan Kalyan : వైసీపీ వాళ్ళలాగా సినిమా వాళ్ళని మేము కష్టపెట్టం.. పవన్ సంచలన ట్వీట్.. అప్పటి రోజులను గుర్తుచేసుకొని..

దేవర నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ కి పవన్ కళ్యాణ్ రిప్లై ఇస్తూ..

Pawan Kalyan Sensational Tweet on Film Industry Support comparing with YCP Government

Pawan Kalyan : ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక సినీ పరిశ్రమకు సపోర్ట్ గానే ఉంటున్నారు. సీఎం చంద్రబాబుకు సినీ పరిశ్రమతో ఉన్న సంబంధాలు, పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమ వ్యక్తి కావడంతో అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా దేవర సినిమా రిలీజ్ కు టికెట్ పెంపు, ఎక్స్ ట్రా షోలు.. ఇలా అడిగిన అన్నిటికి పర్మిషన్లు ఇచ్చారు. దీంతో ఎన్టీఆర్, నిర్మాతలు, మూవీ టీమ్ అంతా పవన్ కళ్యాణ్ కు, సీఎం చంద్రబాబుకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు.

Also Read : NTR – Pawan Kalyan : ఆల్ ది బెస్ట్ తారక్.. మా ప్రభుత్వం సినిమా పరిశ్రమకు సపోర్ట్‌గా ఉంటుంది.. పవన్ కళ్యాణ్ స్పెషల్ ట్వీట్..

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ వారి ట్వీట్స్ కి రిప్లై ఇవ్వడం గమనార్హం. ఎన్టీఆర్ ట్వీట్ కి రిప్లై ఇస్తూ ఆల్ ది బెస్ట్ తారక్ గారు, సినిమా పరిశ్రమకు మా ప్రభుత్వం ఎప్పుడూ సపోర్ట్ గా ఉంటుంది అని ట్వీట్ చేసారు. అలాగే దేవర నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ కి పవన్ కళ్యాణ్ రిప్లై ఇస్తూ.. NDA గవర్నమెంట్ లో ఏపీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగు సినీ పరిశ్రమకు ఎలాంటి రాజకీయ, వ్యక్తుల అనుబంధాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ సపోర్ట్ చేస్తాము. మేము గత వైసీపీ ప్రభుత్వం లాగా ఫిలిం మేకర్స్ ని, నటులను ఇబ్బంది పెట్టము. వైసీపీ సమయంలో ఫిలిం మేకర్స్, నటులు ఎంత ఇబ్బంది పడ్డారో నాకు పర్సనల్ గా తెలుసు. మీ సినిమా రిలీజ్ కి ఆల్ ది బెస్ట్ అంటూ ట్వీట్ చేసారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

గతంలో వైసీపీ ప్రభుత్వం ఎక్స్ ట్రా షోలు క్యాన్సిల్ చేసి, టికెట్ రేట్ల పెంపుకు ఆమోదం తెలపకుండా, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాలకు రేట్లు తగ్గించి, భీమ్లా నాయక్, బ్రో సినిమాలకు అనేక ఇబ్బందులకు గురి చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లోనే పవన్ వీటిపై గట్టిగా మాట్లాడారు. ఆయన పడ్డ కష్టాలు సినిమా పరిశ్రమ వాళ్ళు కష్టపడకూడదు అని సినీ పరిశ్రమకు అన్ని రకాలుగా అండగా ఉంటున్నారు పవన్. ఇప్పుడు ఇలా వైసిపి వాళ్ళలాగా సినిమా వాళ్ళను మేము కష్టపెట్టాం అంటూ మరోసారి సినీ రిశ్రమకు ఏపీ ప్రభుత్వం పూర్తి సహకారం ఇస్తుందని క్లారిటీ ఇచ్చారు డిప్యూటీ సీఎం.