Pawan Kalyan Song Title Hey Chikittha as Movie Title Announced
Hey Chikittha : సినిమాల్లోని సాంగ్స్ లో బాగా పాపులర్ అయిన పదాలతో ఇప్పటికే అనేక సినిమాలు వచ్చాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హిట్ సాంగ్స్ లో ఒకటయిన హే చికితా.. పదాన్ని సినిమా టైటిల్ గా తీసుకున్నారు. అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ LLP బ్యానర్స్ పై ఎన్. అశోక RNS, గరుడవేగ అంజి నిర్మాణంలో ధనరాజ్ లెక్కల దర్శకత్వంలో భారీగా ఈ ‘హే చికితా’ సినిమాని నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో అబినవ్ మణికంఠ, దివిజ ప్రభాకర్, తన్మయి హీరో, హీరోయిన్లగా నటిస్తుండగా, 30 years పృథ్వీ రాజ్, డైరెక్టర్ దేవి ప్రసాద్, ప్రభాకర్, డైరెక్టర్ వీర శంకర్, బలగం సుజాత, సాయి నాయుడు, అశోక్ వర్ధన్, సాయి కౌశిక్, క్రాంతి, అంజి మామ, గంగవ్వ, రాజశేఖర్.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా నేడు వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ హే చికితా టైటిల్ పోస్టర్ ని డైరెక్టర్ అజయ్ భూపతి లాంచ్ చేశారు. అనుసూయ భరద్వాజ్, డైరెక్టర్ సాయి రాజేష్ ,వశిష్ట ఎన్ సింహ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు.
ఇక ఈ పోస్టర్ చూస్తుంటే హే చికితా సాంగ్ లో పవన్ కళ్యాణ్ స్టైల్ తో కటౌట్ ఉంది. ఈ పోస్టర్ చూస్తుంటే బద్రి సినిమా రిలీజ్ సమయంలో కథ అని, వింటేజ్ స్టోరీతో తీస్తున్నట్టు తెలుస్తుంది. పోస్టర్ మాత్రం అదిరింది. పవన్ ఫ్యాన్స్ ఈ పోస్టర్ ని తెగ వైరల్ చేస్తున్నారు. మరి హే చికితా టైటిల్ తో ఎలాంటి సినిమాని అందిస్తారో చూడాలి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.