Dilruba : వాలెంటైన్స్ డే మిస్ అయింది.. ఆ పండక్కి వచ్చేస్తున్న కిరణ్ అబ్బవరం.. నెక్స్ట్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్..

కిరణ్ అబ్బవరం ఇప్పుడు దిల్ రూబా సినిమాతో రాబోతున్నాడు.

Dilruba : వాలెంటైన్స్ డే మిస్ అయింది.. ఆ పండక్కి వచ్చేస్తున్న కిరణ్ అబ్బవరం.. నెక్స్ట్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్..

Kiran Abbavaram Dilruba Movie New Release Date Announced

Updated On : February 14, 2025 / 6:34 PM IST

Dilruba : హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఇటీవ‌లే ‘క’ సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ఇప్పుడు దిల్ రూబా సినిమాతో రాబోతున్నాడు. శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్, ఏ యూడ్లీ ఫిలిం బ్యానర్స్ పై విశ్వ క‌రుణ్ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, రుక్సార్ ధిల్లాన్ జంటగా దిల్ రూబా సినిమా తెరకెక్కుతుంది.

Also Read : Thala Movie : ‘తల’ మూవీ రివ్యూ.. అమ్మ రాజశేఖర్ కొడుకు ఫస్ట్ సినిమా ఎలా ఉందంటే..?

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయి సినిమా రెడీగా ఉంది. ఆల్రెడీ సాంగ్స్, టీజర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు నెలకొల్పారు. అయితే ఈ సినిమా నేడు ఫిబ్రవరి 14న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పలు కారణాలతో ఈ సినిమా వాయిదా పడింది. తాజాగా దిల్ రూబా సినిమా కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు. దిల్ రూబా సినిమా మార్చ్ 14న రిలీజ్ కానున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

Kiran Abbavaram Dilruba Movie New Release Date Announced

వాలెంటైన్స్ డే మిస్ అయినా హోలీ పండక్కి వస్తామంటూ దిల్ రూబా సినిమా మార్చ్ 14న రిలీజ్ చేస్తున్నామని హీరో కిరణ్ అబ్బవరం ప్రకటించాడు. మరి క సినిమాతో పెద్ద సక్సెస్ కొట్టిన కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో మరో హిట్ కొడతాడా చూడాలి.