Pawan Kalyan : తెలుగు చిత్ర పరిశ్రమ ఏ ఒక్కరి సొత్తు కాదు.. ఇది అందరిది..

ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ''ఇలాంటి వేడుకల్లో మీ ఉత్సాహం, ఉరకలు లేకపోతే ఏ కార్యక్రమానికి అందం ఉండదు. ఈ సినిమా ఫంక్షన్ కి నన్ను ఆహ్వానించినందుకు.......................

Pawan Kalyan : తెలుగు చిత్ర పరిశ్రమ ఏ ఒక్కరి సొత్తు కాదు.. ఇది అందరిది..

Pavan Kalyan

Updated On : June 9, 2022 / 11:04 PM IST

Pawan Kalyan :  నాని, నజ్రియా జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘అంటే సుందరానికి’. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులని బాగా అలరించాయి. ఈ సినిమాని ఫుల్ లెంగ్త్ కామెడీ లవ్ ఎంటర్టైనర్ గా జూన్ 10న ప్రేక్షకుల ముందుకి రానుంది. తాజాగా ‘అంటే సుందరానికి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 9 గురువారం సాయంత్రం హైదరాబాద్ శిల్పకళావేదికలో జరగగా ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేశారు.

 

ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ”ఇలాంటి వేడుకల్లో మీ ఉత్సాహం, ఉరకలు లేకపోతే ఏ కార్యక్రమానికి అందం ఉండదు. ఈ సినిమా ఫంక్షన్ కి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. నాని గారి నటనే కాదు, ఆయన వ్యక్తిత్వం కూడా నాకు ఇష్టం. ఆయనకి భగవంతుడు మరిన్ని విజయాలు ఇవ్వాలి. నజ్రియా గారికి తెలుగు చిత్ర పరిశ్రమకు ఆహ్వానం పలుకుతున్నాను. మీరు బాగా చేశారని అందరూ చెప్తుంటే చూడాలని వెయిట్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన ఆర్టిస్టులు అందరికి ధన్యవాదాలు. సినిమాకి పని చేసిన వాళ్లందరికీ అభినందనలు. తెలుగు సినిమా పరిశ్రమ అందరి సొత్తు. ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు. ప్రజల కోసం నిలబడే ధైర్యం, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా నిలబడే ధైర్యం మీరిచ్చారు, తెలుగు చిత్ర పరిశ్రమ ఇచ్చింది.

తెలుగు చిత్ర పరిశ్రమ ఒక కుటుంబానికి చెందింది కాదు. అందరిది. ఎవరి సినిమా వారికి బాగుండాలి అనే కోరుకుంటాం. తెలుగు సినిమా పరిశ్రమలో రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నా సినిమా వేరు, రాజకీయం వేరు. 24 క్రాఫ్టులు కలిస్తే వచ్చేది సినిమా. కళకి కులం, మతం ఉండదు. తెలుగు చిత్ర పరిశ్రమ అంటే గౌరవం. నానికి మా ఇంట్లో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. మా చెల్లి కూడా నానికి అభిమాని. త్వరలో హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ చేయబోతున్నాం. ఇది నాని, నజ్రియా, వివేక్ సినిమా. ఈవెంట్ లో నా AV వద్దు అన్నాను.

Nani : పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి 14 ఏళ్ళు పట్టింది..

కానీ నా మాట వినలేదు. సినిమాకి నాని హీరో. ఆయనే ముందుండాలి. వేసినందుకు నాకు కోపంగా ఉంది. వేయకపోతే మీరు కోప్పడతారని వేశారు అనుకుంట. నా AV చూస్తుంటే నాకే భయమేసింది. రాజకీయాలే ఈజీగా ఉన్నాయి. సినిమా కష్టం. నాకు ఇష్టమై ఆ డ్యాన్సులు చేయలేదు. మీకోసం చేశాను కష్టపడి, మీకు భయపడి, మీ అల్లరి తట్టుకోలేక నేను డ్యాన్స్ చేస్తున్నాను. నిర్మాతలు, దర్శకులు నాకు గన్ పాయింట్ లో పెట్టి డ్యాన్స్ చేయిస్తూ ఉంటారు. నాకు డ్యాన్స్ కంటే కూడా నడవడం ఇష్టం, నడిచే అవకాశాలు ఇవ్వండి. క్షేమంగా ఇంటికి వెళ్ళండి అందరూ” అని తెలిపారు. చివర్లో నివేదా గురించి మర్చిపోవడంతో మళ్ళీ వచ్చి తను మంచి నటి అని చెప్పారు.