Pawan Kalyan : OG షూటింగ్ మొదలుపెట్టిన పవన్.. ఫ్యాన్స్ గెట్ రెడీ..

ఇప్పుడు OG సినిమా పూర్తిచేసే పనిలో పడ్డారు పవన్ కళ్యాణ్.

Pawan Kalyan Starting OG Movie Shooting Fans Excited

Pawan Kalyan : ఎట్టకేలకు పవన్ మిగిలిన మూడు సినిమాలను త్వరగా పూర్తి చేయడానికి సన్నద్ధం అయ్యారు. రాజకీయాల్లో బిజీగా ఉన్నా టైం చూసుకొని డేట్స్ ఇస్తున్నారు. ఈ సంవత్సరం లోపు అన్ని సినిమాల షూటింగ్స్ పూర్తిచేస్తానని పవన్ నిర్మాతలకు మాట ఇచ్చారు. చెప్పినట్టే ఇటీవల హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తిచేశారు. ఇప్పుడు OG సినిమా పూర్తిచేసే పనిలో పడ్డారు.

సుజీత్ దర్శకత్వంలో DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న OG సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో పవన్ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతుండటం, మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శించబోతుండటంతో పాటు ఇప్పటికే రిలీజయిన OG గ్లింప్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ ఏ రాజకీయ మీటింగ్ కి వచ్చినా ఫ్యాన్స్ OG OG అని అరుస్తున్న సంగతి తెలిసిందే. ఆ రేంజ్ లో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

Also See : Sudheer Babu : ఫ్రెండ్స్ తో సుధీర్ బాబు బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు..

అయితే థాయిలాండ్ లో జరగాల్సిన షూట్ తాడేపల్లిలో చేస్తున్నారట. OG కోసం స్పెషల్ సెట్స్ అమరావతి దగ్గర వేసారట. దాంతో పవన్ అటు ప్రభుత్వం పనులు, ఇటు షూటింగ్ పనులు చూసుంటారు. నేడు OG సినిమా షూటింగ్ మొదలైందని సమాచారం. OG కెమెరా టీమ్ కి సంబంధించి ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షూట్ మొదలైందని పెట్టడంతో ఈ వార్త వైరల్ గా మారింది. మూవీ యూనిట్ కూడా తాజాగా షూట్ మొదలైందని అధికారికంగా ప్రకటించింది. షూటింగ్ లొకేషన్ నుంచి ఒక ఫోటో షేర్ చేసి మళ్ళీ మొదలైంది. ఈసారి ముగిద్దాం అని పోస్ట్ చేసారు.

అయితే పవన్ మాత్రం రేపట్నుంచి OG షూట్ లో పాల్గొంటారని సమాచారం. మూవీ యూనిట్ ప్రకారం పవన్ కనీసం 21 రోజులు OG సినిమాకు డేట్స్ ఇవ్వాలని తెలుస్తుంది. మరి పవన్ రెగ్యులర్ గా ఇస్తాడా మళ్ళీ బ్రేక్స్ తీసుకుంటాడా చూడాలి. OG షూట్ మొదలుపెట్టడంతో ఫ్యాన్స్ ఈ సినిమా త్వరగా పూర్తయి రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నారు.

 

Also Read : Nandamuri Family : నందమూరి ఫ్యామిలీ ఫోటో చూశారా? ఎన్టీఆర్ కూతుళ్లు, కొడుకులు, ముని మనవళ్లు, మనవరాండ్లు.. బాలయ్య, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మిస్సింగ్..