Nandamuri Family : నందమూరి ఫ్యామిలీ ఫోటో చూశారా? ఎన్టీఆర్ కూతుళ్లు, కొడుకులు, ముని మనవళ్లు, మనవరాండ్లు.. బాలయ్య, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మిస్సింగ్..
నేడు నందమూరి ఫ్యామిలీ నుంచి మరో కొత్త వారసుడు వచ్చాడు.

Nandamuri Family Photo from NTR New Movie Opening Photo goes Viral
Nandamuri Family : నందమూరి ఫ్యామిలిలో హీరోలు, నిర్మాతలు, సినిమాటోగ్రాఫర్స్.. ఇలా సిని పరిశ్రమలో చాలా మంది ఉన్నారు. సీనియర్ ఎన్టీఆర్ మొదలుకొని జూనియర్ ఎన్టీఆర్ వరకు సినీ పరిశ్రమతో అనుబంధం ఉన్నవాళ్లే. నేడు నందమూరి ఫ్యామిలీ నుంచి మరో కొత్త వారసుడు వచ్చాడు. నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు తారక రామారావు హీరోగా పరిచయం అవుతున్నాడు.
న్యూ ట్యాలెంట్ రోర్స్ బ్యానర్ పై యలమంచలి గీత నిర్మాణంలో వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో నందమూరి తారక రామారావు హీరోగా తెలుగమ్మాయి వీణారావు హీరోయిన్ గా కొత్త సినిమా ప్రకటించగా నేడు ఆ సినిమా ఓపెనింగ్ కార్యక్రమం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నిర్వహించారు. అయితే ఈ సినిమా ఓపెనింగ్ కి ఆల్మోస్ట్ నందమూరి ఫ్యామిలీ అంతా హాజరైంది.
Also Read : NTR : నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు.. ‘ఎన్టీఆర్’ సినిమా ఓపెనింగ్.. క్లాప్ కొట్టిన చంద్రబాబు సతీమణి..
సీనియర్ ఎన్టీఆర్ కూతుళ్లు పురంధేశ్వరి, భువనేశ్వరి, లోకేశ్వరి, కొడుకులు మోహన కృష్ణ, రామకృష్ణ హాజరయ్యారు. అలాగే బాలయ్య భార్య వసుంధర, సీనియర్ ఎన్టీఆర్ కోడళ్ళు, అల్లుళ్ళు, మనవళ్లు, మనవరాళ్లు, ముని మనవళ్లు, ముని మనవరాళ్లు, మరికొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ హాజరయ్యారు. వీరంతా కలిసి మూవీ ఓపెనింగ్ కార్యక్రమంలో ఫోటో దిగారు. నందమూరి ఫ్యామిలీ నుంచి ఇంతమంది ఒకే ఫ్రేమ్ లో చాన్నాళ్లకు కనిపించడంతో ఈ ఫ్యామిలీ ఫోటో వైరల్ గా మారింది. కేవలం ఎన్టీఆర్ కూతుళ్లు, కొడుకులు ఒక ఫోటో దిగగా ఇందులో బాలయ్య మిస్ అయ్యారు.
దీంతో బాలయ్య కూడా ఈ ఈవెంట్ కి వచ్చి ఉంటే ఇంకా కలర్ ఫుల్ గా ఉండేది అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ లండన్ లో ఉండటంతో కార్యక్రమానికి హాజరవలేదు. కళ్యాణ్ రామ్ కూడా ఈ కార్యక్రమానికి రాలేదు. మొత్తానికి కొత్త ఎన్టీఆర్ ఎంట్రీతోనే నందమూరి ఫ్యామిలీ అంతా కలిసి రావడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. వీళ్ళందర్నీ ఒకే దగ్గరికి తీసుకురావడంలో వైవిఎస్ చౌదరి పాత్ర కూడా ఉంది.