NTR : నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు.. ‘ఎన్టీఆర్’ సినిమా ఓపెనింగ్.. క్లాప్ కొట్టిన చంద్రబాబు సతీమణి..
నేడు ఈ సినిమా ఓపెనింగ్ హైదరాబాద్ లోనే ఎన్టీఆర్ ఘాట్ వద్ద జరిగింది.

Nandamuri Family New NTR Introduced as Hero under YVS Chowdary Direction
NTR : నందమూరి ఫ్యామిలీ నుంచి ఇప్పటికే అనేకమంది హీరోలు ఉండగా ఇప్పుడు మరో హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. నందమూరి హరికృష్ణ మనవడు, జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య దివంగత జానకిరామ్ కుమారుడు తారక రామారావు హీరోగా పరిచయం అవుతున్నాడు. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో నందమూరి తారక రామారావు హీరోగా తెలుగమ్మాయి వీణారావు హీరోయిన్ గా న్యూ ట్యాలెంట్ రోర్స్ బ్యానర్ పై కొత్త సినిమా ప్రకటించారు.
నేడు ఈ సినిమా ఓపెనింగ్ హైదరాబాద్ లోనే ఎన్టీఆర్ ఘాట్ వద్ద జరిగింది. ఈ సినిమా ఓపెనింగ్ కి సీనియర్ ఎన్టీఆర్ కూతుళ్లు పురంధేశ్వరి, భువనేశ్వరి, లోకేశ్వరి, కొడుకులు మోహన కృష్ణ, రామకృష్ణ హాజరయ్యారు. అలాగే బాలయ్య భార్య వసుంధర, మరికొంతమంది ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ హాజరయ్యారు.
కొత్త ఎన్టీఆర్, హీరోయిన్ వీణారావులపై చంద్రబాబు భార్య భువనేశ్వరి క్లాప్ కొట్టగా పురంధేశ్వరి, లోకేశ్వరి కెమెరా ఆన్ చేసారు. కొత్త ఎన్టీఆర్ కి నందమూరి కుటుంబంతో పాటు అభిమానులు కంగ్రాట్స్ తెలుపుతున్నారు. ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమంలో ఎన్టీఆర్ ఫ్యామిలీ అంతా హాజరవ్వడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.