Pawan Kalyan stills from OG Movie gone viral
OG Movie : పంజా మూవీ తరువాత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మళ్ళీ ఇప్పుడు ఒక గ్యాంగ్ స్టార్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. OG అనే పవర్ ఫుల్ టైటిల్ ని ఖరారు చేసుకున్న ఈ మూవీని సాహో ఫేమ్ సుజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే దాదాపు 50 శాతం పైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నాలుగో షెడ్యూల్ ని పవన్ కళ్యాణ్ లేకుండానే షూటింగ్ జరుపుకుంటుంది.
Bro Movie : బాబాయ్ ఫంక్షన్‌కి మెగా వారసులు.. రామ్ చరణ్ కూడా చీఫ్ గెస్ట్‌గా..?
కాగా ఈ మూవీలోని పవన్ కి సంబంధించిన కొన్ని స్టిల్స్ సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఆ ఫొటోల్లో పవన్ మార్షల్ ఆర్ట్స్ చేస్తూ కనిపిస్తున్నాడు. కేవలం స్టిల్స్ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాయి. ఇక మూవీలో పవన్ క్యారెక్టర్ ఇంకెంత పవర్ ఫుల్ గా ఉండబోతుందో అని ఫ్యాన్స్ థ్రిల్ ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం ఆ మార్షల్ ఆర్ట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే, ఈ మూవీ ఓవర్ సీస్ రైట్స్ భారీ ధరకి అమ్ముడు పోయినట్లు ఫిలిం వర్గాల్లో వినిపిస్తుంది. పవన్ లాస్ట్ మూవీ భీమ్లా నాయక్ ధర కంటే డబల్ రేటుకి 18 కోట్లకు OG రైట్స్ డీల్ క్లోజ్ అయ్యినట్లు సమాచారం.
Game Changer : గేమ్ చేంజర్‌లో ఆరు కంటే ఎక్కువ సాంగ్స్.. అంతేకాదు హీరో థీమ్స్.. థమన్!
Everyone will die with #OG Hype ??? pic.twitter.com/UXF03QHCKv
— PSPK Rule ? (@PSPKRule) July 25, 2023
పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది ఏప్రిల్ రిలీజ్ కానుందని తెలుస్తుంది. ఏపీ ఎలక్షన్స్ డిసెంబర్ 2023 లో జరిగితే మూవీ రిలీజ్ ఏప్రిల్. అలా కాకుండా 2024 ఏప్రిల్ ఎలక్షన్స్ జరిగితే మూవీ రిలీజ్ డిసెంబర్. ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్ గా నటిస్తుండగా తమిళ్ స్టార్ యాక్టర్స్ అర్జున్ దాస్, శ్రియారెడ్డి, ఇమ్రాన్ హష్మి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. RRR నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.