Bro Movie : బాబాయ్ ఫంక్షన్‌కి మెగా వారసులు.. రామ్ చరణ్ కూడా చీఫ్ గెస్ట్‌గా..?

పవన్ కళ్యాణ్ బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా రామ్ చరణ్ వస్తున్నాడు.

Bro Movie : బాబాయ్ ఫంక్షన్‌కి మెగా వారసులు.. రామ్ చరణ్ కూడా చీఫ్ గెస్ట్‌గా..?

Ram Charan is the chief guest for Pawan Kalyan Bro pre release event

Updated On : July 25, 2023 / 8:51 PM IST

Bro Movie : సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) మెయిన్ లీడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తూ చేస్తున్న సోషియో ఫాంటసీ మూవీ బ్రో. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో కేతిక శర్మ (Ketika Sharma), ప్రియా ప్రకాష్ వారియర్, బ్రహ్మానందం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ నెల 28న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు జులై 25న గ్రాండ్ గా జరగబోతుంది.

OG Movie : ఒక పోస్టర్ కూడా రిలీజ్ కాలేదు.. కానీ డబల్ రేటుకి OG రైట్స్..!

హైదరాబాద్ శిల్ప కళా వేదికలో జరగబోతున్న ఈ కార్యక్రమం 6 గంటలకి మొదలు కావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం వానలు బాగా పడుతుండడంతో హైటెక్ సిటీ వద్ద భారీ ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో పోలిసుల సూచనతో ఈవెంట్ ని 8 గంటలకు ప్రారంభించనున్నట్లు నిర్వాహుకులు తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెగా వారసులు నిహారిక, వరుణ్ తేజ్, వైష్ణవ తేజ్ హాజరవుతున్నారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కూడా రాబోతున్నట్లు తెలుస్తుంది. దీని పై ప్రస్తుతం అయితే సస్పెన్స్ నెలకుంది. మెగాభిమానులు మాత్రం బాబాయ్ అండ్ అబ్బాయిని ఒకే స్టేజి పై చూసేందుకు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. బాబాయ్ ఫంక్షన్ కి మెగా వారసులు వస్తుండడంతో సోషల్ మీడియా అంతా మెగా అభిమానుల సందడి కనిపిస్తుంది.

Tiger Nageswara Rao : రవితేజ ఫ్యాన్స్‌కు సాలిడ్‌ అప్‌డేట్‌..మనం పెంచిన పులి వేటాడటానికి సిద్ధమయ్యింది