OG Theatrical Rights : హరిహర వీరమల్లు ఇంకా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే OG థియేటరికల్ రైట్స్ కోసం పోటీ..

పవన్ OG సినిమాపై ఎంతటి భారీ అంచనాలు ఉన్నాయో అందరికి తెలిసిందే.

They Call Him OG

OG Theatrical Rights : టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జులై 24న హరిహర వీరమల్లు సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాకు భారీగానే థియేట్రికల్ బిజినెస్ జరిగింది. తెలంగాణలో 65 కోట్లకు మైత్రి, సితార వాళ్ళు కొనుక్కున్నారు. ఆంధ్రలో 80 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయని సమాచారం. అయితే హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవ్వకుండానే OG థియేట్రికల్ రైట్స్ కి గట్టి పోటీ నడుస్తుందని సమాచారం.

పవన్ OG సినిమాపై ఎంతటి భారీ అంచనాలు ఉన్నాయో అందరికి తెలిసిందే. ఒక్క గ్లింప్స్ తోనే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు OG రైట్స్‌ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని టాక్.

Also Read : Allu Arjun : అమెరికాలో ‘అల్లు అర్జున్’.. లేటెస్ట్ ఫొటోలు వైరల్..

ఇప్పటికే ఓజీ మూవీ రైట్స్ దక్కించుకునేందుకు విడివిడిగా అన్ని కలిపి 200 కోట్లకు పైగా ఆఫర్స్ వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ అయితే ఏకంగా 140 కోట్ల వరకూ ఇవ్వడానికి రెడీగా ఉన్నారని ఫిల్మ్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్, సుజీత్ దర్శకత్వం, సినిమా మీద ఉన్న హైప్ లాంటి అంశాలు ఈ భారీ డిమాండ్‌కు కారణమని అంటున్నారు.

త్వరలో రిలీజ్ కానున్న మూవీ హరిహర వీరమల్లు రైట్స్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రి మూవీ మేకర్స్‌కు కలిపి ఇచ్చారు. ఓజీ సినిమా రైట్స్‌ విషయంలోనూ అదే ఫార్ములా రిపీట్ అయ్యే అవకాశాలున్నాయట. సితార, మైత్రి మూవీ మేకర్స్‌ జాయింట్‌గా థియేట్రికల్ రైట్స్‌ను షేర్ చేసుకుని, రిలీజ్ బాధ్యతలను కూడా నిర్వహించే ఛాన్స్ ఉందని టాక్.

Also Read : Producer SKN – Allu Sirish : అల్లు శిరీష్ కి హిట్ ఇస్తా.. అల్లు అర్జున్ తో సినిమా తీస్తా.. నిర్మాత SKN కామెంట్స్..

ఈ వ్యూహంతో రెండు సంస్థలు రిస్క్‌ను తగ్గించుకోవడంతో పాటు, పవన్ సినిమాకు ఉన్న క్రేజ్‌ను, బజ్‌ను క్యాష్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాయంటున్నారు. సెప్టెంబర్ 25న రిలీజ్ కానున్న ఓజీ మూవీలో పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్, తమన్ మ్యూజిక్, సుజీత్ మార్క్ డైరెక్షన్‌తో బాక్సాఫీస్ దగ్గర బొమ్మ దద్దరిల్లిపోవాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్.