Pawan Kalyan They Call Him OG Movie Teaser with Arjun Das Voice Over Releasing on September 2nd
OG Teaser : పవన్ రాబోయే సినిమాల్లో అభిమానులు OG సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. సుజిత్(Sujeeth) దర్శకత్వంలో DVV దానయ్య నిర్మాణంలో ప్రియాంక మోహన్(Priyanka Mohan) హీరోయిన్ గా పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా మూడు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసింది. పవన్ డేట్స్ ఇస్తే మిగిలిన షూట్ కూడా పూర్తి చేయనున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ ఇమ్రాన్ హష్మీ, తమిళ్ స్టార్ అర్జున్ దాస్, శ్రీయారెడ్డిలు, మరికొంతమంది స్టార్స్ నటిస్తున్నారు.
ఇక OG సినిమా టీజర్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు సెప్టెంబర్ 2న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. టీజర్ పోస్టర్ రిలీజ్ చేసి రాబోయే టీజర్ పై మరింత హైప్ పెంచారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. OG సినిమా టీజర్ ని అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ తో చెప్పించనున్నటు తెలుస్తుంది. ఇక ఈ టీజర్ ఒక నిమిషం పైనే ఉంటుందని టాక్.
Allu Arjun : బ్రహ్మానందం నివాసంలో బన్నీ సందడి.. పిక్స్ వైరల్
అర్జున్ దాస్ కి, అతని గంభీరమైన వాయిస్ కి తమిళ్ తో పాటు తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. అతని వాయిస్ ఓవర్ తో పవన్ OG టీజర్ వస్తుంది అని ప్రకటించడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. మరి పవన్ బర్త్ డే రోజు రాబోయే OG టీజర్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.
#OG glimpse
Duration – 72 secs
Voice Over – Arjun DasThe Fire Storm is coming?
||#TheyCallHimOG | #PawanKalyan | #OGTeaser|| pic.twitter.com/iIBSW8gTP0
— Manobala Vijayabalan (@ManobalaV) August 26, 2023