Allu Arjun : బ్రహ్మానందం నివాసంలో బన్నీ సందడి.. పిక్స్ వైరల్
ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం (Brahmanandam) నివాసంలో ఐకాన్ స్టార్, జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Allu Arjun-Brahmanandam
Allu Arjun-Brahmanandam : ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం (Brahmanandam) నివాసంలో ఐకాన్ స్టార్, జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బ్రహ్మానందం రెండో కుమారుడు సిద్ధార్థ్ వివాహం ఆగస్టు 19న హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
Gandeevadhari Arjuna OTT : గాండీవధారి అర్జున ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్..! స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Allu Arjun at Brahmanandam House
అయితే.. వ్యక్తిగత కారణాల వల్ల అల్లు అర్జున్ ఈ పెళ్లికి హాజరు కాలేకపోయారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని బ్రహ్మానందం నివాసానికి ఐకాన్ స్టార్ వెళ్లారు. సిద్ధార్థ్ – ఐశ్వర్య దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Samantha : మయోసైటిస్ బాధితులు కోసం రంగంలోకి దిగుతున్న సమంత..

Allu Arjun at Brahmanandam House
బ్రహ్మానందంతో పాటు ఆయన కుటుంబ సభ్యులతో కాసేపు బన్నీ సరదాగా మాట్లాడారు.

Allu Arjun at Brahmanandam House
ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడి అవార్డు సొంతం చేసుకోవడం పట్ల బ్రహ్మానందం ఆనందం వ్యక్తం చేశారు. బన్నీకి పుష్పగుచ్ఛం అందజేసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. బ్రహ్మానందం కుటుంబ సభ్యులతో అల్లు అర్జున్ కలిసి ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Allu Arjun at Brahmanandam House
కాగా.. బ్రహ్మానందం, అల్లు అర్జున్‌కు మధ్య ఉన్న అనుబంధం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
Jabardasth Shanthi : సర్జరీ కోసం.. ఇంటిని అమ్మేస్తున్న జబర్దస్త్ నటుడు