Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్.. పవర్ స్టార్ లుక్ అదిరిందిగా..

తాజాగా సర్ ప్రైజ్ చేస్తూ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. దీంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Pawan Kalyan Ustaad Bhagat Singh first look Released

Ustaad Bhagat Singh : ఇన్నాళ్లు పొలిటికల్ బిజీలో ఉన్న పవన్ కళ్యాణ్(Pawan kalyan) గత కొన్ని రోజులుగా వరుస షూట్స్ లో పాల్గొంటున్నారు. 2024 ఎలక్షన్స్(Elections) కి ఫుల్ ఫోకస్ చేయాలని ఈ లోపే 2023 చివరికల్లా చేతిలో ఉన్న సినిమాలు షూటింగ్స్ పూర్తవ్వాలని వరుసగా డేట్స్ ఇస్తూ సినిమా షూట్స్ పూర్తి చేసేస్తున్నాడు పవన్. ఇప్పటికే వినోదయ సితం(Vinodaya Sitham) సినిమా రీమేక్ షూట్ పూర్తి చేసేసిన పవన్ హరీష్ శంకర్(Harish Shankar) దర్శకత్వంలో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) రెండు షెడ్యూల్స్ పూర్తి చేసేసారు. ఇక సుజిత్(Sujith) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ హైప్ ఉన్న సినిమా OG కూడా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసేశారు.

నిర్మాణ సంస్థలు కూడా ఇన్నాళ్లు సైలెంట్ గా ఉండి ఇప్పుడు వరుస అప్డేట్స్ ఇస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ ని నేడు సాయంత్రం 4.59 కి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో అభిమానులు ఈ గ్లింప్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఫ్యాన్స్ ని మరింత జోష్ లో నింపడానికి తాజాగా సర్ ప్రైజ్ చేస్తూ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. దీంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Pawan Kalyan : పవన్ షూటింగ్స్ కు పొలిటికల్ గ్యాప్.. ఇంకా స్పీడ్ గా సినిమాలు పూర్తి చేయాలి అంటున్న అభిమానులు..

ఈ ఫస్ట్ లుక్ లో పవన్ స్టైలిష్ గా నించొని ఉన్నాడు. పోలీసులు అడ్డం పెట్టే బ్యారికేడ్ కు ఆనుకొని ఉన్నాడు. వెనకాల కొంతమంది మనుషులు నించొని ఉన్నారు. ఫోటో చూస్తుంటే ఏదో ఫైట్ సీన్ కి సంబంధించిందని అర్ధమవుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ లుక్ అదిరిపోయింది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తూ ఈ పోస్టర్ ని వైరల్ చేస్తున్నారు.