Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ సెకండ్ షెడ్యూల్ షురూ.. యాక్షన్ పార్ట్!

పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన హరీష్ శంకర్. సెకండ్ షెడ్యూల్ షురూ చేయడం కోసం..

Pawan Kalyan Ustaad Bhagat Singh second schedule starts soon

Ustaad Bhagat Singh : పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎనర్జిటిక్ హీరోయిన్ శ్రీలీల (sreeleela) ఈ సినిమాలో పవన్ కి జోడిగా నటిస్తుంది. ఈ మూవీ ఇటీవలే సెట్స్ పైకి వెళ్లిన విషయం తెలిసిందే. కేవలం ఎనిమిది రోజులోనే మొదటి షెడ్యూల్‌ పూర్తి చేసేసిన చిత్ర యూనిట్.. ఆ షెడ్యూల్ లో హై-వోల్టేజ్ యాక్షన్ సీన్స్, శ్రీలీలతో రొమాంటిక్ పార్ట్, పిల్లలతో వినోదభరితమైన సన్నివేశాలు, పోలీస్ స్టేషన్ సెట్‌లో మరికొన్ని కీలకమైన సీన్స్ ని తెరకెక్కించినట్లు తెలియజేశారు.

Pawan Kalyan OG : పవన్ అభిమానికి OG నిర్మాత డివివి బిర్యానీ పార్సిల్‌.. ఫోటో వైరల్!

ఇక మొదటి షెడ్యూల్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ OG మూవీ సెట్స్ లో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ ఉస్తాద్ సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నాడు. ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ మొదలు కాబోతుంది అంటూ నిర్మాతలు తెలియజేశారు. ఈ షెడ్యూల్ లో యాక్షన్ పార్ట్ చిత్రీకరించబోతున్నట్లు తెలియజేశారు. ఇందుకోసం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, డీఓపీ బోస్ తో హరీష్ శంకర్ ప్లాన్ చేస్తున్న ఫోటోలను షేర్ చేశారు. ఇక ఈ అప్డేట్ తో పవన్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.

NTR – Pawan Kalyan : పవన్ కంటే ముందు ఎన్టీఆర్ ఆ పని చేశారు.. దివిసీమ ఉప్పెన!

ఇటీవలే ఈ మూవీ ఎడిటింగ్ వర్క్స్ కూడా మొదలు పెట్టినట్లు తెలియజేశారు. ఇక గబ్బర్ సింగ్ కి మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి కూడా సంగీతం అందిస్తున్నాడు. పవన్ అండ్ దేవిశ్రీ కలయికలో వచ్చిన అన్ని ఆల్బమ్స్ సూపర్ హిట్టే. దీంతో ఈ మూవీ సాంగ్స్ పై ఆడియన్స్ లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక ఈ మ్యూజిక్ సిట్టింగ్స్ ని కూడా ఇటీవలే స్టార్ట్ చేశారు. దాదాపు ట్యూన్స్ కూడా ఫైనలైజ్ అయ్యినట్లు తెలుస్తుంది.