Pawan Kaluyan
Pawanothsavam: కరోనా.. లాక్‌డౌన్ కారణంగా ఫిజికల్ సెలబ్రేషన్స్ కు దూరంగా ఉంటున్నా.. డిజిటల్ గా మాత్రం పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు. తమ అభిమాన హీరో పుట్టిన రోజుకు పాలాభిషేకాలు, అన్నదానాలు, రక్తదానాలు చేసేందుకు బదులు కుదరకపోవడంతో డిజిటల్ గా కొన్ని వారాల ముందు నుంచే ట్రెండ్ చేస్తున్నారు.
డిజిటల్ గా పవర్ స్టార్ అభిమానుల గురించి చెప్పే పనే లేదు. ఇటువంటి స్పెషల్ డేస్ సమయంలో సెలబ్రేషన్స్ ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేస్తుంటారు. ఇలాగే #పవనోత్సవం అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి సెలబ్రేట్ చేస్తున్నారు. అంతేకాకుండా @PawanKalyan,
#పవనోత్సవం అని కూడా ట్యాగ్ చేస్తున్నారు.
కొన్ని సోషల్ మీడియా పేజ్‌లు అయితే దీనిని ప్రత్యేక ఉద్యమం స్థాయిలో భావించి షెడ్యూల్ వారీగా 6గంటలకు పోస్టర్, 7గంటల 30నిమిషాలకు లోగో, 8గంటలకు స్పెషల్ వీడియో, 9గంటలకు మరో వీడియో, 10గంటలకు స్పెషల్ డిజైన్ అంటూ అప్ డేట్స్ ఇస్తామంటూ ఎంగేజ్మెంట్ పెంచుకుంటున్నాయి.
సెప్టెంబర్ 2న జరగనున్న పవర్ స్టార్ బర్త్ డే కోసం ఇప్పటి నుంచే సెలబ్రేషన్ మొదలుపెట్టేశారన్న మాట.