Payal Rajput : మరో పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు పాయల్ రాజ్‌పుత్..
ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెదరని ముద్ర వేసింది పాయల్ రాజ్‌పుత్. కుర్రాళ్లకు హాట్ ఫేవరెట్‌గా మారింది.

Payal Rajput another pan India movie
Payal Rajput another pan India movie : ‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెదరని ముద్ర వేసింది పాయల్ రాజ్‌పుత్. కుర్రాళ్లకు హాట్ ఫేవరెట్‌గా మారింది. ఆ తరువాత వరుస సినిమాల్లో నటించింది. అయితే.. ఆ చిత్రాలు ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేకపోయాయి. ఎట్టకేలకు ‘మంగళవారం’ మూవీతో సూపర్ డూపర్ హిట్‌ను అందుకుంది ఈ పంజాబీ ముద్దుగుమ్మ. తాజాగా అమ్మడు ఓ పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతోంది.
ముని దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ఆయనే కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. టికెట్ ఎంటర్టైన్‌మెంట్స్, అర్జున్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ బ్యానర్లలో తొలి చిత్రంగా రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రంలో పాయల్ పాత్ర చాలా ఎమోషన్‌గా ఉండబోతుందని చిత్ర బృందం చెబుతోంది.
ఈ చిత్ర షూటింగ్ జనవరి 24 నుంచి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని రానానాయుడు స్టూడియోస్‌లో ఈ చిత్ర ప్రారంబోత్సవం జరగనుంది. పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్ర ప్రారంభోత్సవానికి హాజరు కానున్నారు. ఆ రోజు ఈ చిత్రంలో ఎవరెవరు నటించనున్నారు అనే విషయాలను వెల్లడించనున్నారు.