వెంకీమామతో పాయల్ పాప
ఫిబ్రవరి 22నుండి.. రాజమండ్రి పరిసరాల్లో వెంకీమామ షూటింగ్ ప్రారంభం..

ఫిబ్రవరి 22నుండి.. రాజమండ్రి పరిసరాల్లో వెంకీమామ షూటింగ్ ప్రారంభం..
విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగచైతన్యల కాంబోలో, బాబీ డైరెక్షన్‌లో రూపొందుతున్న సినిమా, వెంకీమామ.. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ కలిసి నిర్మిస్తున్న వెంకీమామ స్ర్కిప్ట్ వర్క్ కంప్లీట్ చేసుకుని, మరికొద్ది రోజుల్లో సెట్స్‌పైకి వెళ్ళనుంది. చైతన్యకి జోడీగా రకుల్ ప్రీత్ నటిస్తుండగా, వెంకీ సరసన శ్రియని హీరోయిన్‌గా ఫిక్స్ చేసారని వార్తలొచ్చాయి. ఇప్పుడు శ్రియ ప్లేస్‌లో ఆర్ఎక్స్ 100 బ్యూటీ, పాయల్ రాజ్‌పుత్‌ని సెలెక్ట్ చేసారని తెలుస్తుంది. ఆర్ఎక్స్ 100 తో కుర్రాళ్ళకి కంటిమీద కునుకు లేకుండా చేసిన పాయల్, వెంకీమామలో వెంకటేష్ సరసన నటించనుంది. ఫిబ్రవరి 22నుండి.. రాజమండ్రి పరిసరాల్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది.
వెంకీమామ కోనసీమ బ్యాక్ డ్రాప్‌లో రూపొందబోయే సినిమా కావడంతో, షూటింగ్ కోసం రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాలని సెలెక్ట్ చేసుకున్నారు.. ఈ సినిమాలో వెంకీ విలేజ్‌కి చెందిన వ్యక్తిగా, చైతన్య సిటీ నుంచి పల్లెటూరికి వచ్చే యువకుడిగా కనిపించనున్నాడట. చైతు ఆర్మీ ఆఫీసర్‌గా కనిపిస్తాడని ఫిలింనగర్ వర్గాల సమాచారం. ఫ్యామిలీ, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందబోయే వెంకీమామ దసరాకి రిలీజ్ కానుంది. రవితేజ పక్కన డిస్కోరాజాలోనూ పాయల్ హీరోయిన్‌గా నటిస్తుంది.