Heroine Digangana : హీరోయిన్ పై నెమలి దాడి..
బిగ్ బాస్ ఫేం, యువ హీరోయిన్ దిగంగన సూర్యవంశి.. హిందీలో పలు సీరియల్స్, సినిమాలతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది.
Peacock attack on the heroine Digangana : బిగ్ బాస్ ఫేం, యువ హీరోయిన్ దిగంగన సూర్యవంశి.. హిందీలో పలు సీరియల్స్, సినిమాలతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ‘ఏక్ వీర్ కి అర్దాస్ … వీరా’ అనే సీరియల్తో చాలా పాపులర్ అయిన దిగంగన బిగ్ బాస్ సీజన్ 9లో కంటెస్టెంట్గా వెళ్లి అశేష ప్రేక్షక ఆదరణ పొందింది.
తెలుగులో కార్తికేయ సరసన హిప్పి అనే చిత్రంలోనూ నటించింది. ప్రస్తుతం గోపిచంద్ హీరోగా సంపత్ నంది తెరకెక్కిస్తున్న సీటీమార్ చిత్రంలో సెకండ్ హీరోయిన్గా నటిస్తోంది. దిగంగన రీసెంట్గా నెమళ్లు ఉండే ప్రాంతానికి వెళ్లింది. అక్కడ నెమలి అందాలను చూస్తూ పరవశించిపోతుంది.
అంతలోనే నెమలి గాల్లోకి ఎగిరి దిగంగనపై దాడి చేసింది. దీంతో దిగంగన గట్టిగా కేకలు పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.