Pelli SandaD Trailer : మహేష్ బాబు రిలీజ్ చేసిన ‘పెళ్లిసందD’ ట్రైలర్..

హీరో శ్రీకాంత్ తనయుడు, శ్రీలీల నటిస్తున్న ‘పెళ్లిసందD’ ట్రైలర్ సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు..

Pelli Sandad Trailer

Pelli SandaD Trailer: హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్‌ను పూర్తి స్థాయి హీరోగా, శ్రీలీలను హీరోయిన్‌గా.. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు శిష్యురాలు గౌరి రోనంకి దర్శకురాలిగా పరిచయం చేస్తూ.. ఆర్కా మీడియా బ్యానర్ మీద శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, మాధవి కోవెలమూడి నిర్మిస్తున్న బ్యూటిఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘పెళ్లిసందD’..

K Raghavendra Rao : ‘మౌనముని’ మాట్లాడబోతున్నారు.. నటుడిగా దర్శకేంద్రుడు!

ఆర్.కె. ఫిలిం అసోసియేట్స్ అధినేత కె.కృష్ణ మోహన్ రావు సమర్పిస్తుండగా.. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వహిస్తున్న ఈ సినిమా పాటలకు, రాఘవేంద్ర రావు నటుడిగా ఎంట్రీ ఇస్తున్న ‘వశిష్ట’ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోకు మంచి స్పందన లభించింది. ఇటీవల ‘కింగ్’ నాగార్జున టీజర్ రిలీజ్ చెయ్యగా.. ఇప్పుడు ‘పెళ్లిసందD’ థియేట్రికల్ ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు.

Republic Trailer : ‘అజ్ఞానం గూడు కట్టినచోటే.. మోసం గుడ్లు పెడుతుంది’..

హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, విజువల్స్, ఆర్ఆర్ చక్కగా కుదిరాయి. ‘పెళ్లిసందడి’ తరహాలోనే చక్కటి ప్రేమ మరియు కుటుంబ కథా చిత్రంగా ‘పెళ్లిసందD’ తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ప్రకాష్ రాజ్, రావు రమేష్, తనికెళ్ల భరణి, ఝాన్సీ, హేమ తదితరులు నటించిన ‘పెళ్లిసందD’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.