Site icon 10TV Telugu

Pellilo Pelli : ‘పెళ్లిలో పెళ్లి’ టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్.. ఆకాష్ పూరి చేతుల మీదుగా..

Pellilo Pelli Title First Look Launch by Akash Jagannadh

Pellilo Pelli

Pellilo Pelli : గౌరి ఫిలింస్, సుఖకర్త ఫిలింస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘పెళ్లిలో పెళ్లి’. శివ సాయిరిషి, సంస్కృతి గోరే, విష్ణు ప్రియ, ఉమా మహేశ్వరరావు, తనికెళ్ల భరణి.. పలువురు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గణేష్ కోలి నిర్మాణంలో శ్రీకాంత్ సంబరం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించగా పూరి జగన్నాధ్ తనయుడు, హీరో ఆకాష్ పూరి, తనికెళ్ళ భరణిలు గెస్ట్ లుగా వచ్చారు.

ఈ ఈవెంట్లో నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. ‘పెళ్లిలో పెళ్లి’ సినిమా ఈవెంట్ జరుగుతుంటే బయట కుండపోత వర్షం కురుస్తోంది. ఆ పరమేశ్వరుడు గంగ రూపంలో ఆశీర్వాదం పంపించాడు అనిపిస్తోంది. ఈ సినిమా బ్యానర్ పేరు సుఖకర్త అంటే సుఖాన్ని అందించేవాడు. షోలాపూర్ లో సినిమా షూటింగ్ జరిగింది. అక్కడ తెలుగు వాళ్లు చాలా మంది ఉన్నారు. హైదరాబాద్ లో సినిమా చేయడం సులువే కానీ షోలాపూర్ కు 24 క్రాఫ్టుల వాళ్లను తీసుకెళ్లి చాలా స్పీడ్ గా సినిమాని తీశారు అని తెలిపారు.

Also Read : War 2 : ఎన్టీఆర్ – హృతిక్ ‘వార్ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్ వచ్చేసింది.. ఎప్పుడు.. ఎక్కడ..? హృతిక్ వస్తాడా?

హీరో శివ సాయిరిషి మాట్లాడుతూ.. నన్ను ఈ వేదిక మీద చూసి మా అమ్మ సంతోషిస్తోంది. ఈ సినిమా చేసేందుకు నాకు మా ప్రొడ్యూసర్ గణేష్, డైరెక్టర్ శ్రీకాంత్ ఎంతో సపోర్ట్ చేశారు. షోలాపూర్ నాకు మరో ఇల్లులా మారింది అని అన్నారు. నిర్మాత గణేష్ కోలి మాట్లాడుతూ.. మేము మహారాష్ట్రలో ఉంటాం కానీ తెలుగు సినిమాలు చూస్తుంటాం. తెలుగు భాషను అభిమానిస్తాం. తెలుగులో వచ్చే కుటుంబ కథా సినిమాలను ఇష్టపడతాం. సినిమా మేకింగ్ మీద అభిరుచితోనే ఈ సినిమాని నిర్మించాను. ఈ కథలో ట్విస్ట్ ఏంటనేది ఇంకా నాకు కూడా రివీల్ చేయలేదు. నేనూ మీతో పాటే థియేటర్స్ లో చూడబోతున్నాను అని తెలిపారు.

డైరెక్టర్ శ్రీకాంత్ సంబరం మాట్లాడుతూ.. ఆకాష్ జగన్నాథ్ గారిని ఇన్వైట్ చేసేప్పుడు నేను దేవుడిలా భావించే పూరి జగన్నాథ్ గారిని కలిశాను. షోలాపూర్ కు తెలుగు వాళ్లు వెళ్లి వందేళ్లవుతోంది. కానీ అక్కడి నుంచి ఒక తెలుగు సినిమాను చేసింది మాత్రమే మేమే. నేను ఒక గణేష్ మండపం దగ్గర ప్రొడ్యూసర్ గణేష్ కోలి గారిని కలిశాను. ఇప్పుడు పోస్టర్ లాంఛ్ ఈవెంట్ చూస్తుంటే ఆ వినాయకుడే మమ్మల్ని ఇక్కడిదాకా నడిపించాడని అనిపిస్తోంది అని అన్నారు.

Also Read : Anchor Ravi : పెద్ద డైరెక్టర్ దగ్గరకు వెళ్లి ఒక చిన్న వేషం అయినా ఇమ్మని అడిగా.. ఆయన ఏమన్నాడంటే..

హీరో ఆకాష్ జగన్నాథ్ మాట్లాడుతూ.. ఇది పోస్టర్ లాంఛ్ లా లేదు ప్రీ రిలీజ్ ఈవెంట్ లా గ్రాండ్ గా చేశారు. ఈ సినిమా టీమ్ చూస్తుంటే అంతా యంగ్ స్టర్స్ ఉన్నారు. ఇలాంటి యంగ్ టీమ్ కు అవకాశం ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్న ప్రొడ్యూసర్ గణేష్ కోలి గారికి, డైరెక్టర్ శ్రీకాంత్ గారికి నా అభినందనలు. పెళ్లిలో పెళ్లి సినిమా టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. సినిమా కూడా మంచి కంటెంట్ తో వస్తుందని నమ్ముతున్నా అన్నారు.

Exit mobile version