Rajasaab
Rajasaab : రెండు రోజులక్రితం రాజాసాబ్ దర్శక నిర్మాతలపై ఢిల్లీకి చెందిన IVY ఎంటెర్టైన్మెంట్ సంస్థ ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. IVY ఎంటెర్టైన్మెంట్ సంస్థ.. రాజాసాబ్ సినిమాలో 218 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు, అందుకు గాను ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ లో హక్కులు ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నట్టు, సినిమాని ఎలాంటి పోటీ లేని సమయంలో సింగిల్ రిలీజ్ గా వచ్చేలా చూడాలని అనుకున్నట్టు, కానీ షూటింగ్ ఇంకా అవ్వలేదని, సినిమా అప్డేట్స్ ఇవ్వట్లేదని, తాము చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నారని, సినిమాని వాయిదా వేస్తున్నారని, పెట్టిన డబ్బు మొత్తం 18 శాతం వడ్డీతో చెల్లించాలని ఆరోపణలు చేస్తూ పిటిషన్ లో పేర్కొన్నారు.
కోర్టు పీపుల్ మీడియా సంస్థను ప్రశ్నించగా తాజాగా దీనిపై నిర్మాత కోర్టుకు సమాధానమిచ్చారు. రిలీజ్ సమయంలో మొత్తం చెల్లిస్తామని, షూటింగ్ జరుగుతుందని, చెప్పిన టైంకి రిలీజ్ చేస్తామని తెలిపినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి IVY ఎంటెర్టైన్మెంట్ సంస్థ ఒప్పుకుందని, రాజాసాబ్ ఇష్యూ క్లోజ్ అయిందని సమాచారం. మరి ఇంతటితో రాజాసాబ్ సమస్య ముగిసినట్టేనా లేక IVY ఎంటెర్టైన్మెంట్ సంస్థ తర్వాత మళ్ళీ ఏమైనా మెలిక పెడుతుందా చూడాలి.
Also Read : Rajinikanth : అప్పుడు కొడుకుగా నటించి.. ఇప్పుడు రజినీకాంత్ తోనే వార్ కి సిద్దమైన హీరో..
ఇక ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో రాజాసాబ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థలో ఈ సినిమా హారర్ కామెడీగా తెరకెక్కుతుంది. రాజాసాబ్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ లో సమ్మె నడుస్తుండటంతో షూటింగ్ ఆగింది. రాజాసాబ్ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. ఇటీవల డిసెంబర్ 5న రిలీజ్ చేస్తామన్నారు. కానీ ఇప్పుడు వచ్చే సంవత్సరం సంక్రాంతికి వాయిదా పడేలా ఉందని సమాచారం.