Telangana : తెలంగాణలో ఐదో షోకి పర్మిషన్..

తెలంగాణలో కూడా ఐదో షోకి పర్మిషన్ ఇవ్వమని ఎప్పట్నుంచో కోరుతున్నారు. ఇప్పటికే ప్రత్యేకంగా పర్మిషన్ అడిగిన పెద్ద సినిమాలకి తెలంగాణ ప్రభుత్వం ఐదో షోకి పర్మిషన్లు ఇస్తుంది.............

Telangana : తెలంగాణలో ఐదో షోకి పర్మిషన్..

Movies

Updated On : March 10, 2022 / 3:09 PM IST

Telangana:  ఇటీవల సినిమా పరిశ్రమ సమస్యలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి సినీ పెద్దలు వివరించారు. అందులో ఐదో షోకి కూడా పర్మిషన్ ఇవ్వాలని కోరారు. మొన్నటి వరకు ఏపీలో సినిమాకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇటీవలే టికెట్ రేట్లు పెంచుతూ జీవో ఇచ్చారు. అలాగే పెద్ద సినిమాలకి కూడా మొదటి పది రోజులు టికెట్ రేట్లు పెంచుకోవచ్చని చెప్పారు. అయితే ఇండస్ట్రీ వాళ్ళు అడుగుతున్న ఐదో షో గురించి మాత్రం ఎక్కడా తెలపలేదు. గతంలో చిరంజీవి, మరి కొంతమంది ప్రముఖులు జగన్ ని కలిసినప్పుడు చిన్న సినిమాలకి ఐదో షో పర్మిషన్ ఇస్తామని చెప్పారు, కానీ ఏపీలో అది ఇంకా ఆచరణలోకి రాలేదు.

అయితే తెలంగాణలో కూడా ఐదో షోకి పర్మిషన్ ఇవ్వమని ఎప్పట్నుంచో కోరుతున్నారు. ఇప్పటికే ప్రత్యేకంగా పర్మిషన్ అడిగిన పెద్ద సినిమాలకి తెలంగాణ ప్రభుత్వం ఐదో షోకి పర్మిషన్లు ఇస్తుంది. మార్చ్ 11న రిలీజ్ కానున్న రాధేశ్యామ్ సినిమాకి కూడా ఐదో షోకి పర్మిషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అంతేకాకుండా తాజాగా తెలంగాణాలో అన్ని సినిమాలకి అన్ని థియేటర్లలో ఐదో షోకి పర్మిషన్ ఇచ్చారు. ఉదయం 10 గంటల నుంచి అర్థరాత్రి 1 గంట మధ్యలో ఈ ఐదో ఆటకి అనుమతిని ఇచ్చింది ప్రభుత్వం.

Prabhas: రెబల్ స్టార్ యాక్షన్.. ఢీకొట్టే పవర్ఫుల్ విలన్స్ వీళ్ళే

Telangana

ఇన్నాళ్లు నాలుగు షోలు ఉండేవి. ఇప్పుడు ఐదో షో ఇవ్వడం వల్ల సినీ పరిశ్రమకి చాలా సపోర్ట్ అవ్వనుంది. దీంతో టికెట్స్ బ్లాక్ లో అమ్మడం, ఎక్కువ ధరలకు అమ్మడం, థియేటర్ల వద్ద రద్దీ.. లాంటివి తగ్గడమే కాక సినిమాలకి మంచి కలెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది.