Urfi Javed
Urfi Javed : ఉర్ఫీ జావేద్ గురించి ఎవరికీ పరిచయం చేయనక్కర్లేదు. సోషల్ మీడియాలో తన వీడియోలు చూడని వారుండరు. వెరైటీ కాస్ట్యూమ్స్‌తో ఫోజులు ఇస్తూ విమర్శల పాలయ్యారు ఉర్ఫీ. తాజాగా ఈ నటి ఆసుపత్రి బెడ్‌పై ఆక్సిజన్ మాస్క్‌తో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఈ నటికి ఏమైందా? అని జనం ఆందోళన పడ్డారు.
Urfi Javed : డిఫరెంట్ డ్రెస్సింగ్‌తో సందడి చేసే ఉర్ఫీ జావెద్.. నెటిజెన్స్‌కి షాక్ ఇస్తూ.. ఈసారి..
ఉర్పీ జావేద్ కరణ్ జోహార్ బిగ్ బాస్ OTT లో పాల్గొన్న తర్వాత ఒక్కసారిగా జనాలకు పరిచయం అయ్యారు. ఇక ఆ తర్వాత అనేక షోలలో పాల్గొన్నారు. అయితే వీటన్నింటికంటే తన డ్రెస్సింగ్ స్టైల్‌తో ఉర్ఫీ బాగా వైరల్ అయ్యింది. వెరైటీ కాస్ట్యూమ్స్ వేసుకుని నిత్యం జనం మధ్యలో ఫోజులు ఇచ్చే ఉర్ఫీపై చాలానే విమర్శలు ఉన్నాయి. అయినా అవేం పట్టించుకోకుండా వింత డ్రెస్సులతో ఫోజులు ఇస్తూనే ఉన్నారు ఈ నటి. తాజాగా ఉర్ఫీ ఆక్సిజన్ మాస్క్‌తో హాస్పిటల్ బెడ్‌పై పడుకుని ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసారు. ‘2024 ని బ్యాంగ్‌తో స్టార్ట్ చేయండి’ అనే శీర్షికతో షేర్ చేసిన ఫోటో ఒక్కసారిగా వైరల్ అయ్యింది. చాలామంది తనకేమైందా? అని ఆరా తీసారు. ఈలోపు ఉర్పీ పెట్టిన పోస్టు కనిపించకుండా పోయింది.
Jamal Kudu : ‘జమాల్ కుడు’ పాటకి.. బాలీవుడ్ ఇద్దరు మెగాస్టార్స్ స్టెప్పులు.. వీడియో వైరల్
ఉర్ఫీ పోస్టుపై నటి సంభవనా సేథ్ స్పందించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అంతలోనే ఉర్ఫీ మరో వీడియోను షేర్ చేసారు. ఆ వీడియోలో ఉర్ఫీ కస్టమర్లకు ఫుడ్ అందిస్తూ వెయిట్రెస్‌గా మారారు. ‘కల సాకారం అయ్యింది. ఏ ఉద్యోగమైనా పెద్దది.. చిన్నది కాదు.. అది మనం ఎంచుకోవడంలో ఉంటుంది. నేను ఒక గంట పాటు వెయిట్రెస్‌గా ఉండాలనుకున్నాను. క్యాన్సర్ పేషెంట్ ఎయిడ్ అసోసియేషన్‌కు నా సంపాదన అందించడం థ్రిల్‌గా ఉన్నాను. ఇలాంటి దయతో కూడిన పనులు చేయాలని అనుకుంటున్నాను’ అనే శీర్షికతో పోస్టు చేసారు. ఉర్ఫీ జావేద్ పోస్టు వైరల్ అవుతోంది. ఉర్ఫీ ప్రస్తుతం ‘లవ్ సెక్స్ ఔర్ ధోకా 2’ తో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు.