Urfi Javed : డిఫరెంట్ డ్రెస్సింగ్‌తో సందడి చేసే ఉర్ఫీ జావెద్.. నెటిజెన్స్‌కి షాక్ ఇస్తూ.. ఈసారి..

వింత వింత డ్రెస్సులతో విమర్శలు ఎదుర్కునే నటి ఉర్ఫీ జావేద్ ఈసారి నెటిజన్లకు నిజంగానే షాక్ ఇచ్చారు. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Urfi Javed : డిఫరెంట్ డ్రెస్సింగ్‌తో సందడి చేసే ఉర్ఫీ జావెద్.. నెటిజెన్స్‌కి షాక్ ఇస్తూ.. ఈసారి..

Urfi Javed

Updated On : November 9, 2023 / 2:02 PM IST

Urfi Javed : ఉర్ఫీ జావెద్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో విచిత్రమైన దుస్తులతో హల్చల్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆమెపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే ఎప్పుడూ చూడని విధంగా ఉర్ఫీ జావేద్ సల్వార్ సూట్ వేసుకుని గోల్డెన్ టెంపుల్‌ని సందర్శించారు. సల్వార్ కమీజ్‌లో ఉర్ఫీని చూసిన నెటిజన్లు షాకయ్యారు.

Urfi Javed : ఉర్ఫీ జావేద్ అరెస్ట్ ఫేక్ అంట.. ఈసారి నిజంగా క్రిమినల్ కేసు నమోదు చేసిన ముంబై పోలీస్..

ఉర్ఫీ జావేద్ ఎప్పుడూ ట్రోల్స్ ఎదుర్కుంటు ఉంటారు. ఎందుకంటే ఆమె ఎంచుకునే దుస్తులు అలా ఉంటాయి. వింత ఫ్యాషన్ పిచ్చితో వికారమైన దుస్తులు ధరించి ధైర్యంగా పబ్లిక్‌లో కనిపిస్తారు. దీంతో సోషల్ మీడియాలో అనేక విమర్శలు ఎదుర్కుంటూ ఉంటారు. తాజాగా ఈ నటి అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. పింక్ సల్వార్ కమీజ్‌లో స్టన్నింగ్ లుక్స్‌తో ఉన్న ఉర్ఫీని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఫోటోల్లో ఉర్ఫీతో పాటు ఆమె సోదరి డాలీ జావేద్ కూడా ఉన్నారు.

ఉర్ఫీ పిక్స్ చూసిన నెటిజన్లు ఆమెను చాలా అందంగా ఉన్నావంటూ పొగడ్తలతో ముంచెత్తారు. రెండు రకాలుగా ఉంటే అమ్మాయి అని మరికొందరు కామెంట్లు చేశారు. ఇటీవల ఉర్ఫీ చేసిన ఓ వీడియో కారణంగా ఆమెపై కేసు నమోదైంది. ముంబయి పోలీసులు తనను అరెస్టు చేసినట్లు ఉర్ఫీ ఓ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఇద్దరు మహిళా పోలీసులు ఆమెను అరెస్టు చేసినట్లు ఉంది. ఈ వీడియో వైరల్ అయిన తరువాత నిజంగానే ముంబయి పోలీసులు విచారణ చేపట్టారు. ఉర్ఫీని అరెస్టు చేసింది నకిలీ పోలీసులు అని తేలడంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఉర్ఫీతో పాటు వీడియోలో ఉన్నవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

Rashmika Mandanna : ఉర్ఫీ జావేద్‌ని ఫాలో అవుతున్న రష్మిక.. బాయ్‌కాట్ చేయాలంటూ నెటిజెన్లు కామెంట్లు!

ఉర్ఫీ జావేద్ ‘బిగ్ బాస్ OTT’ లో కంటెస్టెంట్‌గా ఫుల్ పాపులర్ అయ్యారు. ఆ తర్వాత టీవీ షోలలో, సీరియల్స్‌లో పేరు తెచ్చుకున్నారు. అన్నింటికంటే తన విచిత్రమైన దుస్తులతో ఎక్స్‌పోజ్ చేస్తూ విపరీతంగా ట్రోల్ అయ్యారు.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)