Jamal Kudu : ‘జమాల్ కుడు’ పాటకి.. బాలీవుడ్ ఇద్దరు మెగాస్టార్స్ స్టెప్పులు.. వీడియో వైరల్

ఇటీవల యానిమల్ మూవీలో బాబీ డియోల్ ఎంట్రీ కోసం ఉపయోగించిన 'జమాల్ కుడు' పాట ఎంత వైరల్ అయ్యిందో చెప్పనవసరం లేదు. తాజాగా ఈ పాటని..

Jamal Kudu : ‘జమాల్ కుడు’ పాటకి.. బాలీవుడ్ ఇద్దరు మెగాస్టార్స్ స్టెప్పులు.. వీడియో వైరల్

Bollywood Megastars Dharmendra Salman Khan steps for Jamal Kudu song

Updated On : January 2, 2024 / 6:35 PM IST

Jamal Kudu : సందీప్ వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ‘యానిమల్’. ఈ చిత్రంలో బాబీ డియోల్ విలన్ గా నటించారు. సినిమా బాబీ డియోల్ ఎంట్రీ కోసం దర్శకుడు ఉపయోగించిన ‘జమాల్ కుడు’ అనే బ్యాక్ గ్రౌండ్ సాంగ్.. ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఆ పాటకు బాబీ డియోల్ వేసిన క్రేజీ స్టెప్పులు యూత్ ని బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఆ స్టెప్ ని రీ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియా రీల్స్ చేస్తున్నారు.

కేవలం ఆడియన్స్ మాత్రమే కాదు సెలబ్రిటీస్ ని కూడా ఈ సాంగ్ అండ్ స్టెప్ బాగా ఆకట్టుకుంది. దీంతో వారి కూడా ఈ మ్యూజిక్ స్టెప్ వేస్తూ అలరిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ ఇద్దరు మెగాస్టార్స్ ఈ పాటకి స్టెప్ వేయడం అందర్నీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్.. హిందీ బిగ్‌బాస్ షోకి హోస్టుగా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక రీసెంట్ ఎపిసోడ్ కి ఒకప్పటి బాలీవుడ్ మెగాస్టార్ ధర్మేంద్ర, సల్మాన్ ఖాన్ బ్రదర్ అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్ గెస్ట్‌లుగా వచ్చారు. ఈ ఎపిసోడ్ లోనే ఈ అతిథులు అందరితో సల్మాన్.. జమాల్ కుడు పాటకి చిందేసేలా చేశారు. వారితో పాటు సల్మాన్ కూడా జమాల్ కుడు స్టెప్ ని రీ క్రియేట్ చేసేందుకు ట్రై చేశారు. ఇక ఒక వేదిక పై ఇద్దరు మెగాస్టార్స్ సల్మాన్ ఖాన్, ధర్మేంద్ర కలిసి సందడి చేయడంతో బాలీవుడ్ అభిమానులు తెగ సంబరపడుతూ.. ఆ వీడియోని ట్రెండ్ చేస్తున్నారు.

Also read : Bollywood : 2024లో బాలీవుడ్‌‌లో వచ్చే పెద్ద చిత్రాలు ఇవే.. వీటిలో సౌత్‌లో కూడా రిలీజయ్యే..