Santhanam : గోవింద నామాలతో పేరడీ సాంగ్ చేసిన తమిళ్ కమెడియన్.. భక్తులు ఫైర్.. జనసేన నేత పోలీసులకు ఫిర్యాదు..

శ్రీనివాస గోవిందా.. అనే గోవింద నామాలతో పేరడీ సాంగ్ ని చేశారు.

Santhanam : గోవింద నామాలతో పేరడీ సాంగ్ చేసిన తమిళ్ కమెడియన్.. భక్తులు ఫైర్.. జనసేన నేత పోలీసులకు ఫిర్యాదు..

Police Complaints on Santhanam Govinda Parady Song Hindus Fires on Movie Unit

Updated On : May 13, 2025 / 5:06 PM IST

Santhanam : తమిళ్ స్టార్ కమెడియన్ సంతానం అప్పుడప్పుడు హీరోగా కూడా సినిమాలు చేస్తూ ఉంటాడు. సంతానం హీరోగా చేసిన డీడీ నెక్స్ట్ లెవల్ సినిమా మే 16న రిలీజ్ కానుంది. ఇటీవల రెండు నెలల క్రితం ఈ సినిమా నుంచి ఓ పాటను విడుదల చేశారు. శ్రీనివాస గోవిందా.. అనే గోవింద నామాలతో పేరడీ సాంగ్ ని చేశారు. పార్కింగ్ డబ్బులు గోవిందా.. పాప్ కార్న్ ట్యాక్స్ గోవిందా.. అంటూ గోవింద నామాలను కామెడీగా, ర్యాప్ సాంగ్ గా మార్చారు.

ఈ పాట వైరల్ అవ్వడంతో హిందూ భక్తులు మూవీ యూనిట్ పై మండిపడుతున్నారు. వేంకటేశ్వరస్వామి గోవిందనామాలతో ఇలా చేయడం కరెక్ట్ కాదని కామెంట్స్ చేస్తున్నారు. తమిళనాడులో పలు చోట్ల సంతానం పై, మూవీ యూనిట్ పై పోలీసులకు ఫిర్యాదులు చేశారు. పాటని వెంటనే తొలిగించాలని డిమాండ్ చేశారు.

Also Read : Bellamkonda Sreenivas : రాంగ్ రూట్ లో బెల్లంకొండ శ్రీనివాస్ హల్చల్.. కానిస్టేబుల్ ప్రశ్నించడంతో..

తాజాగా ఈ వివాదంపై సినిమా ప్రమోషన్స్ లో సంతానం స్పందించాడు. సంతానం మాట్లాడుతూ.. మేము శ్రీవారిని అవమానించలేదు. సెన్సార్ బోర్డు నిబంధనల మేరకే సినిమా తీసాం. రోడ్డు మీద పోయే వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడతారు. వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని అన్నారు. ఈ వ్యాఖ్యలతో సంతానంపై మరింత మండిపడుతున్నారు భక్తులు. మరి ఈ వివాదం ఇంకెంత కొనసాగుతుందో చూడాలి.

అయితే ఈ విషయంలో జనసేన నేత కిరణ్ రాయల్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. కిరణ్ రాయల్ మాట్లాడుతూ.. తమిళనాడులో నిర్మించిన ఒక సినిమాలో వెంకటేశ్వర స్వామి వారి పాటను భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చిత్రీకరించారు. పాటను చిత్రం నుంచి తొలగించి చిత్రం తీసిన వారిపై చర్యలు తీసుకోవాలి. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా తమిళనాడు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. వెంకటేశ్వర స్వామి వారి పాటను ర్యాప్ సాంగ్ లాగా చిత్రీకరించారు. తమిళ చిత్రంలోని ఆ పాట చిత్రీకరించిన తీరు శ్రీవారి భక్తులు, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. దీనిని జనసేన పార్టీ సీరియస్ గా తీసుకుంటున్నాం. తమిళనాడులో హిందువులు గొడవలు చేస్తున్నప్పటికీ సెన్సార్ బోర్డ్ అనుమతించింది. ప్రభుత్వం కూడా సహకారం ఉందని చిత్ర నిర్మాతలు చెబుతున్నారు. అక్కడున్న ముఖ్యమంత్రి, ప్రభుత్వం నాస్తికుల ప్రభుత్వం. ముఖ్యమంత్రి, అతని కొడుకు నాస్తికులు. హిందూ మతాన్ని నమ్మరు. అందుకనే వారు ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తున్నారు. హిందువులపై ఇది కుట్రగా భావిస్తున్నాము. తమిళనాడుకు చెందిన ప్రజా ప్రతినిధులు ఆ పాటను చిత్రం నుండి తొలగించేలా చేయాలి. లేదా చిత్రాన్ని బ్యాన్ చేసేలా పోరాటాలు చేయాలి. వెంకటేశ్వర స్వామి వారిని కించపరిచేలా పాటను రీమేక్ చేసిన తమిళనాడు ప్రజాప్రతినిధులకు టీటీడీ దర్శనాలు కల్పించవద్దు. వారికి నిజంగా భక్తి ఉంటే చిత్రాన్ని బ్యాన్ చేసిన తర్వాత దర్శనాలు కల్పించండి అని అన్నారు.

Also Read : Nani : హీరో నాని అక్క బావని చూశారా? ఫస్ టైం సినిమా ఈవెంట్ కి.. నాని ఏమన్నాడంటే..

భక్తులు ఫైర్ అవుతున్న గోవిందా సాంగ్ ఇదే..