Bellamkonda Sreenivas : హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై కేసు నమోదు.. ఎందుకంటే..
తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ పై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.

Police Filed a Case on Actor Bellamkonda Sreenivas
Bellamkonda Sreenivas : తాజాగా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఇటీవల శ్రీనివాస్ కార్ లో హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ వద్ద రాంగ్ రూట్ లో వెళ్లి హల్చల్ చేసాడు. రాంగ్ రూట్ లో కార్ తో ట్రాఫిక్ కానిస్టేబుల్ పైకి దూసుకొచ్చాడు. కానిస్టేబుల్ అడ్డుకుని నిలదీయడంతో దురుసుగా ప్రవర్తించి వెళ్ళిపోయాడు.
తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ పై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. రాంగ్ రూట్ లో కారు నడపడమే కాకుండా ట్రాఫిక్ పోలీసుపై దురుసుగా ప్రవర్తించాడని, తన ఇంటికి వెళ్తున్న క్రమంలో జర్నలిస్ట్ కాలనీ చౌరస్తా వద్ద రాంగ్ రూట్లో వచ్చాడని, రాంగ్ రూట్లో రావడంతో బెల్లంకొండను అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అడ్డుకోవడంతో సదరు కానిస్టేబుల్ తో దురుసుగా బెల్లంకొండ శ్రీనివాస్ ప్రవర్తించాడని, కానిస్టేబుల్ పైకి కారుతో దూసుకెళ్లినందుకు ప్రయత్నించాడని కేసు నమోదు చేశారు. మరి దీనిపై శ్రీనివాస్ స్పందిస్తాడా చూడాలి.
ఇక కొన్నాళ్ళుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన శ్రీనివాస్ త్వరలో వరుస సినిమాలతో రాబోతున్నాడు. మే 30న శ్రీనివాస్ భైరవం అనే సినిమాతో రాబోతున్నాడు. ఆ తర్వాత టైసన్ నాయుడు, హైందవ, కిష్కింధపూరి.. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ వార్తల్లో నిలిచాడు.