Jani Master : ర‌హ‌స్య ప్ర‌దేశంలో జానీ మాస్ట‌ర్‌ను విచారిస్తున్న పోలీసులు!

గోవాలో జానీ మాస్ట‌ర్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు హైద‌రాబాద్‌కు త‌ర‌లించారు.

Police Secretly Interrogating Jani Master In a Farm House

గోవాలో జానీ మాస్ట‌ర్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు హైద‌రాబాద్‌కు త‌ర‌లించారు. ప్ర‌స్తుతం జానీ మాస్ట‌ర్ నార్సింగి పోలీసుల అదుపులో ఉన్నాడు. పోలీసులు ఆయ‌న్ను ర‌హ‌స్య ప్ర‌దేశంలో విచారిస్తున్నారు. న‌గ‌ర శివారులోని ఓ ఫామ్ హౌస్‌లో ఆయ‌న్ను విచారిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. విచార‌ణ అనంతరం ఆయ‌న్ను ఫోక్సో కోర్టు న్యాయ‌మూర్తి ముందు హాజ‌రు ప‌ర‌చ‌నున్నారు.

సైబ‌రాబాద్ ఎస్ఓటీ పోలీసుల బృందం గోవాలోని లాడ్జ్‌లో గురువారం జానీ మాస్ట‌ర్‌ని అదుపులో తీసుకుంది. అక్క‌డి కోర్టులో హాజ‌రు ప‌రిచిన అనంత‌రం న‌గ‌రానికి తీసుకువ‌చ్చారు. లేడి కొరియోగ్రాఫ‌ర్ ఫిర్యాదు మేర‌కు రాయ‌దుర్గం పీఎస్‌లో జీరో ఎఫ్ఐఆర్ న‌మోదు చేసిన త‌రువాత కేసును నార్సింగి పీఎస్‌కు బ‌దిలీ చేశామ‌ని పోలీసులు వెల్ల‌డించారు.

Bigg Boss 8 : ఈ వీక్ షాకింగ్ ఎలిమినేష‌న్‌..! డేంజ‌ర్ జోన్‌లో ఆ ముగ్గురు కంటెస్టెంట్స్‌?

2020లో త‌న ద‌గ్గ‌ర ప‌ని చేసే లేడి కొరియోగ్రాఫ‌ర్ పై జానీ మాస్ట‌ర్ లైంగికంగా దాడికి పాల్ప‌డి, ఎవ‌రికి చెప్పొద్ద‌ని బెదిరించిన‌ట్లుగా బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న‌ట్లు పోలీసులు స్ప‌ష్టం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు జానీ మాస్ట‌ర్ పై ఫోక్సో కేసు న‌మోదు చేసిన‌ట్లు నార్సింగి పోలీసులు తెలిపారు.