Bigg Boss 8 : ఈ వీక్ షాకింగ్ ఎలిమినేష‌న్‌..! డేంజ‌ర్ జోన్‌లో ఆ ముగ్గురు కంటెస్టెంట్స్‌?

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 8 ఆస‌క్తిక‌రంగా సాగుతోంది

Bigg Boss 8 : ఈ వీక్ షాకింగ్ ఎలిమినేష‌న్‌..! డేంజ‌ర్ జోన్‌లో ఆ ముగ్గురు కంటెస్టెంట్స్‌?

Bigg Boss 8 Telugu shocking elimination in 3rd week

Updated On : September 20, 2024 / 10:16 AM IST

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 8 ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. గురువారం నాటి ఎపిసోడ్ మొత్తం గొడ‌వ‌ల‌తోనే సాగింది. లేడి కంటెస్టెంట్స్ ఒక‌రినొక‌రు తిట్టుకుంటూ, తోసుకున్నారు. మొత్తానికి హౌస్‌లో ర‌చ్చ రచ్చ జ‌రిగింది. ఇక న‌బీల్ త‌న‌ను అభ్యంత‌ర‌క‌రంగా ట‌చ్ చేశాడ‌ని మొద‌ట చెప్పిన విష్ణు ప్రియ ఆ త‌రువాత అదంతా ఉట్టిదే తూచ్ అని అంది. కిచెన్ విష‌యంలో బిగ్‌బాస్ కొత్త రూల్ తీసుకువ‌చ్చాడు.

వంట చేసే స‌మ‌యంలో కేవ‌లం ముగ్గురు మాత్ర‌మే కిచెన్‌లో ఉండాల‌ని ష‌ర‌తు విధించాడు. దీనిపై అభ‌య్ మండిప‌డ్డాడు. బిగ్‌బాస్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. గుడ్ల టాస్క్‌లో త‌న టీమ్ సంపాదించిన గుడ్ల‌ను కాంతార టీమ్ చీఫ్ అభ‌య్ స‌రిగ్గా కాపాడ‌లేక‌పోయాడు. అయితే.. ప్రేర‌ణ‌, య‌ష్మిలు మాత్రం గుడ్ల‌ను కాపాడుకునేందుకు చాలా గట్టి ప్ర‌యత్నాలే చేశారు.

జానీ మాస్టర్‌పై కేసు పెట్టిన అమ్మాయిపై భార్య అయేషా సంచలన కామెంట్స్

డేంజ‌ర్ జోన్‌లో ఆ ముగ్గురు..

తొలి వారం బేబ‌క్క‌, రెండో వారం శేఖ‌ర్ భాషా ఎలిమినేట్ కావ‌డంతో మూడో వారంలో ఎవ‌రు ఎలిమినేట్ కానున్నారు అనే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. ఈ వారం నామినేష‌న్‌లో మొత్తం ఎనిమిది మంది విష్ణుప్రియ, నాగ మణికంఠ, పృథ్వీ, యష్మీ, ప్రేరణ, సీత, అభయ్, నైనిక ఉన్నారు.

ఇక ఓటింగ్‌లో విష్ణుప్రియ టాప్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. నాగ మణికంఠ కూడా త‌న ఓటింగ్‌ను బాగా మెరుగుప‌ర‌చుకున్నాడు. ఈ వారం నైనిక, అభయ్, పృథ్వీలు డేంజర్ జోన్‌లో ఉన్న‌ట్లు సోష‌ల్ మీడియాలో టాక్‌. ఈ ముగ్గురిలో ఒక‌రు ఎలిమినేట్ అవుతార‌ట.

ఇక్కడ ఇంత రచ్చ జరుగుతుంటే.. గోవాలో జానీ మాస్టర్ జల్సాలు?