ఇక్కడ ఇంత రచ్చ జరుగుతుంటే.. గోవాలో జానీ మాస్టర్ జల్సాలు?
గోవాలో జానీ జల్సాలు చేస్తున్నట్లు తెలియడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Jani Master Case : హైదరాబాద్ లో తీవ్ర ఆరోపణలు.. అవేమీ పట్టించుకోకుండా గోవాలో జల్సాలు.. ఇక్కడేమో విమర్శలు, తిట్లు, ఆగ్రహాలు వెల్లువెత్తుతుంటే.. జానీ మాస్టర్ మాత్రం గోవాలో తెగ చిల్ అవుతున్నాడట. మూడు రోజుల నుంచి పోలీసులు తన కోసం గాలిస్తున్నారని తెలిసినా.. మనోడు మాత్రం ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే, గోవాలో జానీ జల్సాలు చేస్తున్నట్లు తెలియడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read : జానీ మాస్టర్‌పై కేసు పెట్టిన అమ్మాయిపై భార్య అయేషా సంచలన కామెంట్స్
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. మూడు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న జానీని.. గోవాలో అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే, జానీ మాస్టర్ విదేశాల్లో ఉన్నారని, ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నారని ఇప్పటివరకు ప్రచారం జరిగింది. మొత్తం 4 బృందాలు జానీ మాస్టర్ కోసం గాలింపు చేపట్టగా.. చివరికి అతడిని గోవాలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
జానీ మాస్టర్ పై కేసు నమోదై విచారణ ప్రారంభమైన నేపథ్యంలో జానీ మాస్టర్ భార్య ఆయేషా నార్సింగి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. తన భర్తకు వచ్చిన ఫేక్ కాల్ పై సమాచారం తెలుసుకోవడానికి ఆయేషా వచ్చారు. దీంతో పోలీసులకు, ఆయేషాకు మధ్య వాగ్వాదం చోటు చేుసుకుంది. జానీ మాస్టర్ కేసుకి సంబంధించి వివరాలు అడగటానికి ప్రయత్నించిన మీడియా ప్రతినిధులతోనూ ఆయేషా వాగ్వాదానికి దిగారు. నాకే కెమెరా పెడతారా అంటూ మీడియాను బెదిరించారు. చివరకు భార్యను సైతం అదుపులోకి తీసుకుని వాచారిస్తున్నారు.