Ponnam Prabhakar : డ్రగ్స్ కేసుల్లో సినీ ప్రముఖులు ఎంత పెద్దవారున్నా వదిలేది లేదు.. మంత్రి పొన్నం ప్రభాకర్..

తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ శాసన మండలిలో కీలక వ్యాఖ్యలు చేసారు.

Ponnam Prabhakar Serious Comments on Film Industry People

Ponnam Prabhakar : తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ పై సీరియస్ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ విషయంలో పోలీసులు, ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. అయితే హైదరాబాద్ లో డ్రగ్స్ కేసు వినపడిన ప్రతి సారి సినీ పరిశ్రమకు సంబంధించి ఎవరో ఒకరి పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఒక్కోసారి స్టార్స్ పేర్లు లేకపోయినా సినీ పరిశ్రమలో పనిచేసేవాళ్ళో, సినీ పరిశ్రమకు సంబంధం ఉన్న వ్యక్తుల పేరులో వినిపిస్తాయి.

తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ నివారణ కోసం చర్చలు తీసుకుంటుంది. డ్రగ్స్ విషయంలో ఎవరిని ఉపేక్షించట్లేదు. ఈ క్రమంలో తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ శాసన మండలిలో కీలక వ్యాఖ్యలు చేసారు.

Also Read : Allu Arjun Fans : అల్లు అర్జున్ అభిమానులపై కేసులు.. సైబర్ క్రైమ్ పోలీసుల ఫోకస్..

పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మత్తు పదార్థాలు తీసుకునే రాజకీయ, సినీ ప్రముఖులు ఎవరూ చట్టం నుండి తప్పించుకోలేరు. సినీ ప్రముఖులు డ్రగ్స్ కేసుల్లో ఎంత పెద్దవారు ఉన్నా వదిలేది లేదు. నార్సింగి ఫిల్మ్ యాక్టర్ కి సంబంధించిన కేసు నడుస్తుంది. గచ్చిబౌలిలో కొకైన్ కి సంబంధించిన కేసు నడుస్తుంది. మొకిలాలో కొకైన్ కి సంబంధించిన కేసు నడుస్తుంది. ఫాంహౌజ్ లలో పార్టీలు చేయకున్నప్పుడు అనుమతి తీసుకోవాలి అంటూ వ్యాఖ్యలు చేసారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.