Allu Arjun Fans : అల్లు అర్జున్ అభిమానులపై కేసులు.. సైబర్ క్రైమ్ పోలీసుల ఫోకస్..
సైబర్ క్రైమ్ పోలీసులు అలాంటి పోస్టులపై ఫోకస్ చేసారు.

Cyber Crime Police Focus on Allu Arjun Fans Social Media Posts
Allu Arjun Fans : ఇటీవల పుష్ప 2 రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద అల్లు అర్జున్ రావడంతో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడంతో ఈ సంఘటన సంచలనంగా మరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి బెయిల్ పై విడుదల చేసారు. అలాగే పలువురు అల్లు అర్జున్ టీమ్ ని, సంధ్య థియేటర్ కి సంబంధించిన వారిని అరెస్ట్ చేసారు.
అయితే ఈ ఘటనలో పలువురు అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో తెలంగాణ సీఎంని విమర్శించడంతో పలువురు బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నెగిటివ్ పోస్టులు పెడుతున్నాడు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు అలాంటి పోస్టులపై ఫోకస్ చేసారు.
Also Read : Raja Saab : ప్రభాస్ ఫ్యాన్స్‌కు నిరాశే.. ‘రాజా సాబ్’వాయిదా..?
ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్ట్ తరువాత సోషల్ మీడియా పోస్ట్ లకు సంబంధించి 4 కేసులు నమోదు చేసారు. ప్రభుత్వం, సిఎం రేవంత్ రెడ్డి పై అభ్యంతరకర పోస్ట్ లు పెట్టిన వారి మీద పలువురి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేస్ లు నమోదు చేస్తున్నారు. నిందితుల పై ఐటి యాక్ట్ తో పాటు BNS 352,353(1)(b) సెక్షన్ ల కింద కేస్ నమోదు చేస్తున్నారు. మరింతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియా అకౌంట్స్ మీద పోలీసులు ఫోకస్ చేసినట్టు సమాచారం.