Raja Saab : ప్రభాస్ ఫ్యాన్స్‌కు నిరాశే.. ‘రాజా సాబ్’వాయిదా..?
డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న చిత్రం రాజాసాబ్.

Prabhas Raja Saab will be postponed
డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న చిత్రం రాజాసాబ్. హార్రర్ కామెడీ జోనర్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం 2025 ఏప్రిల్ 10న విడుదల కానుందని ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా అనుకున్న తేదీకి రాదని, వాయిదా పడనుందనే వార్తలు ఫిలిం సర్కిల్‌లో చక్కర్లు కొడుతున్నాయి.
ఫౌజీ సినిమా షూటింగ్‌లో ప్రభాస్ కాలుకి గాయమైందని, శస్త్రచికిత్స చేయించుకునేందుకు ఇటలీ వెళ్లనున్నాడని, జనవరి చివరి వారంలోనే తిరిగి రానున్నడని గత రెండు రోజులుగా ఓ న్యూస్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. రాజాసాబ్ అనుకున్న సమయానికి రావపోవడానికి గల కారణాల్లో ఇది ఓ కారణమని అంటున్నారు.
Kalki – Nag Ashwin : జపాన్ లో కల్కి రిలీజ్.. ప్రమోషన్స్ లో నాగ్ అశ్విన్.. ఫొటోలు, వీడియోలు చూశారా?
అదే సమయంలో యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ నటిస్తున్న మూవీ జాక్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ చిత్ర విడుదల తేదీని నేడు (బుధవారం) ప్రకటించారు. ఈ చిత్రాన్ని కూడా సరిగ్గా 2025 ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు తెలియజేశారు. రాజాసాబ్ వాయిదా పడుతుందనే విషయం పై వీరికి క్లారిటీ ఉందని, అందుకనే సరిగ్గా అదే రోజున విడుదల చేస్తున్నట్లు చెప్పారని అంటున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా రోజున మరే సినిమాగా విడుదల కాదని, అదే రోజున విడుదల చేస్తామని చెప్పడం చూస్తుంటే రాజాసాబ్ వాయిదా పడడం ఖాయమని అంటున్నారు. మరి దీనిపై రాజాసాబ్ చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.