OG Movie Shoot : పవన్ OG సినిమాకు థాయిలాండ్ కెమెరామెన్.. బ్యాంకాక్‌లో OG షూట్.. వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసి..

త్వరలో పవన్ OG సినిమాకు డేట్స్ ఇస్తాను అనడంతో పవన్ లేని సీన్స్ ని షూట్ చేయడం మొదలుపెట్టారు మూవీ యూనిట్.

OG Movie Shoot : పవన్ OG సినిమాకు థాయిలాండ్ కెమెరామెన్.. బ్యాంకాక్‌లో OG షూట్.. వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసి..

Thailand Cameramen Working for Pawan Kalyan They Call Him OG Movie in Bangkok Shoot

Updated On : December 18, 2024 / 3:02 PM IST

OG Movie Shoot : పవన్ రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికీ చేతిలో ఉన్న సినిమాలు పూర్తిచేయాలని కుదిరినప్పుడల్లా డేట్స్ ఇస్తూ పూర్తిచేస్తున్నాడు. ఈ క్రమంలో హరిహర వీరమల్లు సినిమా షూట్ క్లైమాక్స్ దశలో ఉంది. ఇది అవ్వగానే OG సినిమా షూట్ లో కూడా పాల్గొంటాడు పవన్. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్ తో OG సినిమాపై మంచి హైప్ వచ్చింది.

Thailand Cameramen Working for Pawan Kalyan They Call Him OG Movie in Bangkok Shoot

త్వరలో పవన్ OG సినిమాకు డేట్స్ ఇస్తాను అనడంతో పవన్ లేని సీన్స్ ని షూట్ చేయడం మొదలుపెట్టారు మూవీ యూనిట్. ప్రస్తుతం OG సినిమా షూటింగ్ బ్యాంకాక్ లో జరుగుతుంది. డైరెక్టర్ సుజీత్, కెమెరామెన్ రవి చంద్రన్ అప్పుడప్పుడు బ్యాంకాక్ నుంచి ఫోటోలు షేర్ చేస్తున్నారు. కొన్ని యాక్షన్ సీన్స్, ఓ ఐటెం సాంగ్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బ్యాంకాక్ లో షూట్ చేస్తున్నట్టు సమాచారం.

Thailand Cameramen Working for Pawan Kalyan They Call Him OG Movie in Bangkok Shoot

అయితే OG సినిమాలో కొన్ని సీన్స్ కి అక్కడ బ్యాంకాక్ లో థాయిలాండ్ కెమెరామెన్ కూడా పనిచేస్తున్నారు. థాయిలాండ్ కి చెందిన ప్రముఖ కెమెరామెన్ టామ్ OG సినిమాకు పనిచేస్తున్నారు. ఇతను గతంలో కూడా పలు ఇండియన్ సినిమాలకు, ఇండియన్ యాడ్స్ కు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసారు.

Thailand Cameramen Working for Pawan Kalyan They Call Him OG Movie in Bangkok Shoot

టామ్ OG టీమ్, డైరెక్టర్ సుజీత్, కెమెరామెన్ రవి చంద్రన్ తో కలిసి దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఈ విషయాన్ని తెలిపాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

Thailand Cameramen Working for Pawan Kalyan They Call Him OG Movie in Bangkok Shoot

కెమెరామెన్ టామ్ ఈ ఫోటోలు షేర్ చేసి.. మాస్టర్ రవి, డైరెక్టర్ సుజీత్ గారితో పనిచేసే మంచి అవకాశం కలిగింది. థ్యాంక్యూ అని తెలిపారు.