Ponniyin Selvan II
Ponniyin Selvan II : గత ఏడాది రిలీజ్ అయిన సౌత్ పాన్ ఇండియా మూవీ ‘పొన్నియిన్ సెల్వన్’ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. తమిళ స్టార్స్ నటించిన ఈ భారీ మల్టీస్టార్రర్ చిత్రాన్ని మణిరత్నం తెరకెక్కించాడు. తమిళ పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా వచ్చిన ఈ మూవీలో విక్రమ్, ఐశ్వర్య బచ్చన్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక రెండు భాగాలుగా చిత్రీకరణ జరుపుకున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ గత ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యింది.
Ponniyin Selvan 1: బుల్లితెరపై సందడి చేసేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్న పొన్నియిన్ సెల్వన్ 1
మొదటి భాగం మంచి విజయం సాధించడంతో సెకండ్ పార్ట్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెకండ్ పార్ట్ ని ఈ ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామంటూ గతంలోనే చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ విడుదల తేదీ చేంజ్ అయ్యింది అంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా దీని పై చిత్ర నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాని మద్రాస్ టాకీస్ పతాకం పై మణిరత్నం, లైకా ప్రొడక్షన్స్ పతాకం పై సుబాస్కరన్ సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
కాగా నేడు (మార్చి 2) సుబాస్కరన్ పుట్టినరోజు కావడంతో బర్త్ డే విషెస్ తెలుపుతూ కొత్త మూవీ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో పొన్నియిన్ సెల్వన్-2 ని ఏప్రిల్ 28 నే రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. దీంతో విడుదల తేదీ మారింది అంటూ వచ్చిన వార్తల్లో ఎటువంటి నిజం లేదని తేలిపోయింది. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ మూవీకి దాదాపు 500 కోట్లు ఖర్చు అయ్యింది. మొదటి బాగంతోనే ఈ బడ్జెట్ మొత్తాన్ని సినిమా సాధించేసింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ రిలీజ్ అయ్యాక, వచ్చే కలెక్షన్స్ అన్ని నిర్మాతలకు లాభాలే.
Wishing the man with a vision, Mr. Subaskaran Allirajah, a very happy birthday ? @LycaProductions #HappyBirthdaySubaskaranSir #PS1 #PS2 #PonniyinSelvan #CholasAreBack pic.twitter.com/KueRuolH6h
— Lyca Productions (@LycaProductions) March 2, 2023