Ponniyin Selvan 1: బుల్లితెరపై సందడి చేసేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్న పొన్నియిన్ సెల్వన్ 1

తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్ 1’ తమిళ బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్‌ను అందుకుంది. ఈ సినిమాను అత్యంత ప్రెస్టీజియస్‌గా మణిరత్నం తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు తమిళ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిని చూపారు. పీరియాడిక్ మూవీగా చోళుల కథతో ఈ సినిమాను మణిరత్నం మలిచిన తీరు అత్యద్భుతంగా ఉందని ఈ సినిమా చూసిన వారు ప్రశంసించారు.

Ponniyin Selvan 1: బుల్లితెరపై సందడి చేసేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్న పొన్నియిన్ సెల్వన్ 1

Ponniyin Selvan 1 Locks World TV Premiere

Ponniyin Selvan 1: తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్ 1’ తమిళ బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్‌ను అందుకుంది. ఈ సినిమాను అత్యంత ప్రెస్టీజియస్‌గా మణిరత్నం తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు తమిళ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిని చూపారు. పీరియాడిక్ మూవీగా చోళుల కథతో ఈ సినిమాను మణిరత్నం మలిచిన తీరు అత్యద్భుతంగా ఉందని ఈ సినిమా చూసిన వారు ప్రశంసించారు.

Ponniyin Selvan 2: సెన్సేషనల్ అప్డేట్.. పొన్నియిన్ సెల్వన్ పార్ట్-2 రిలీజ్ డేట్ ఇదే!

ఇక ఈ సినిమాలో విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష వంటి స్టార్స్ నటించడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో నెలకొన్నాయి. ఇక థియేటర్స్‌లో ఈ సినిమాకు జనం ఫిదా కాగా, ఈ సినిమాను ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇక ఓటీటీలోనూ ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతుండటంతో చిత్ర మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన రెండో పార్ట్ రిలీజ్ డేట్‌ను ఇటీవల ప్రకటించారు. అయితే ఈ సినిమాను ఇప్పుడు బుల్లితెరపై వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Ponniyin Selvan 1: మరో మైల్‌స్టోన్ మార్క్ దాటిన మణిరత్నం సినిమా!

పొన్నియిన్ సెల్వన్ 1 చిత్రాన్ని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా జనవరి 8న సన్ టీవీలో టెలికాస్ట్ చేస్తున్నట్లు సదరు ఛానల్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. దీంతో ఈ గ్రాండియర్ మూవీని బుల్లితెరపై వీక్షించేందుకు తమిళ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమాకు బుల్లితెరపై ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.