Ponniyin Selvan 1: మరో మైల్‌స్టోన్ మార్క్ దాటిన మణిరత్నం సినిమా!

తమిళ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘పొన్నియిన్ సెల్వన్’ మొదటి భాగాన్ని ఇటీవల రిలీజ్ చేశారు. ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మణిరత్నం, ఈ చిత్రాన్ని భారీ క్యాస్టింగ్‌తో చిత్రీకరించారు. ఈ సినిమా ఇప్పటివరకు ఏకంగా రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

Ponniyin Selvan 1: మరో మైల్‌స్టోన్ మార్క్ దాటిన మణిరత్నం సినిమా!

Ponniyin Selvan 1 Movie Crosses Rs 300 Cr Mark

Ponniyin Selvan 1: తమిళ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘పొన్నియిన్ సెల్వన్’ మొదటి భాగాన్ని ఇటీవల రిలీజ్ చేశారు. ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మణిరత్నం, ఈ చిత్రాన్ని భారీ క్యాస్టింగ్‌తో చిత్రీకరించారు. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్లతోనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. కాగా, రిలీజ్ తరువాత ఈ సినిమాకు తమిళంలో అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. అయితే తెలుగునాట మాత్రం ఈ సినిమా అనుకున్న మేర ప్రేక్షకులను అలరించలేకపోయింది.

Ponniyin Selvan: కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న పొన్నియిన్ సెల్వన్

తమిళనాట పొన్నియిన్ సెల్వన్ రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఈ సినిమాను చూసేందుకు అక్కడి ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టడంతో ఈ సినిమా వసూళ్ల పరంగా శరవేగంగా దూసుకుపోతుంది. ఈ సినిమా ఇప్పటివరకు ఏకంగా రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. తమిళ సినిమా సత్తా ఏమిటో మరోసారి ఈ సినిమా నిరూపించిందని తమిళ మీడియా ప్రశంసల వర్షం కురిపిస్తోంది.

Ponniyin Selvan 1 Review : పొన్నియిన్ సెల్వన్ 1 రివ్యూ.. పక్కా తమిళ సినిమా..కొత్త సీసాలో పాత సాంబార్..

ఇక తమిళనాట మరియు ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద కళ్లుచెదిరే వసూళ్లను రాబడుతుండటంతో, ఈ మూవీ మున్ముందు మరిన్ని రికార్డులను తన పేరిట రాసుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ పీరియాడికల్ ఎపిక్ మూవీలో విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష వంటి స్టార్స్ నటించగా, మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.