Ponniyin Selvan: కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న పొన్నియిన్ సెల్వన్

తమిళ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పొన్నియిన్ సెల్వన్-1’ అత్యంత భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. భారీ క్యాస్టింగ్‌తో వచ్చిన ఈ సినిమాను తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ భారీ అంచనాల మధ్య రిలీజ్ చేశారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి మూడు రోజులు పూర్తవగా, ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఏకంగా రూ.230 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి దూసుకుపోతుంది.

Ponniyin Selvan: కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న పొన్నియిన్ సెల్వన్

Ponniyin Selvan 1 Crosses Rs 230 Crores In 3 Days

Ponniyin Selvan: తమిళ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పొన్నియిన్ సెల్వన్-1’ అత్యంత భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. భారీ క్యాస్టింగ్‌తో వచ్చిన ఈ సినిమాను తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ భారీ అంచనాల మధ్య రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాకు తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తిని కనబరిచారు.

Ponniyin Selvan 1 Review : పొన్నియిన్ సెల్వన్ 1 రివ్యూ.. పక్కా తమిళ సినిమా..కొత్త సీసాలో పాత సాంబార్..

దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అయ్యి మూడు రోజులు పూర్తవగా, ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఏకంగా రూ.230 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి దూసుకుపోతుంది. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ దూసుకుపోతుండటంతో ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబట్టడంలో సక్సెస్ అయ్యిందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాను చోళ రాజవంశం.. వారి కాలంలో జరిగిన సంఘటనల గురించి రచయిత కల్కి రచించిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా, ఈ సినిమాను మణిరత్నం అద్భుతంగా తెరకెక్కించడంతో ప్రేక్షకులతో పాటు సినీ విశ్లేషకులు ఈ సినిమాను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Ponniyin Selvan-1: ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాను నడిపించే పాత్రలు ఇవే..!

ఈ సినిమా అక్టోబర్ 3న రూ.250 కోట్ల మార్కును క్రాస్ చేయడం ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇదే జోరును కొనసాగిస్తే, పొన్నియిన్ సెల్వన్ త్వరలోనే లాభాల బాటలోకి రావడం పక్కా అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్. ఇక ఈ సినిమాలో చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిషా తదితరులు ముఖ్య పాత్రల్లో నటించగా, లైగా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.