Ponniyin Selvan-1: ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాను నడిపించే పాత్రలు ఇవే..!

స్టార్ డైరెక్టర్ మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్పుకొస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్-1’ చిత్రం మరికొద్ది గంటల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. హిస్టారిక్ ఫిక్షనల్ సబ్జెక్టుతో రాబోతున్న ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో క్రియేట్ అయ్యాయి. అయితే ఈ ప్రెస్టీజియస్ మూవీలో పది పాత్రలు సినిమాకే హైలైట్ గా ఉండబోతున్నాయని చిత్ర యూనిట్ చెబుతోంది.

Ponniyin Selvan-1: ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాను నడిపించే పాత్రలు ఇవే..!

Ponniyin Selvan 1 Movie Characters

Ponniyin Selvan 1: స్టార్ డైరెక్టర్ మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్పుకొస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్-1’ చిత్రం మరికొద్ది గంటల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. హిస్టారిక్ ఫిక్షనల్ సబ్జెక్టుతో రాబోతున్న ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో క్రియేట్ అయ్యాయి. అయితే ఈ ప్రెస్టీజియస్ మూవీలో పది పాత్రలు సినిమాకే హైలైట్ గా ఉండబోతున్నాయని చిత్ర యూనిట్ చెబుతోంది. మరి ఆ పాత్రలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాకు మెయిన్ పిల్లర్ లాంటి పాత్ర సుందర చోళుడు. చోళ సామ్రాజ్యానికి అతడు రాజు. ఈ కథ మొదలయ్యే సమయానికి సుందర చోళుడు అనారోగ్యం బారినపడి తంజావురు కోటలో మంచం మీద ఉంటాడు. సుందర చోళుడు ఆయన భార్య వానవన్‌ మహాదేవికి ముగ్గురు సంతానం. ‘పొన్నియిన్‌ సెల్వన్‌’లో సుందర చోళుడి పాత్రను ప్రకాశ్‌రాజ్‌ పోషిస్తుండగా, వానవన్‌ మహాదేవిగా విద్య సుబ్రమణియన్‌ చేస్తున్నారు. ఇక సినిమాలో మరో ముఖ్య పాత్ర ఆదిత్య కరికాలుడు. సుందర చోళుడి పెద్ద కొడుకు, చోళ సామ్రాజ్యపు యువరాజు ఆదిత్య కరికాలుడు. కాంచీపురంలో అద్భుతమైన రాజభవనాన్ని నిర్మించుకుని అక్కడే ఉంటాడు. అప్పుడప్పుడూ తల్లిదండ్రులు ఇక్కడకు రావటం, ఆదిత్యుడు వాళ్ల దగ్గరకు వెళ్తుంటారు. ఈ సినిమాలో చియాన్ విక్రమ్ ఆదిత్య కరికాలన్‌ పాత్ర పోషించాడు.

Ponniyin Selvan 1: రికార్డులు చెరిపేస్తున్న మణిరత్నం సినిమా.. విజయ్ ఔట్.. కమల్ నెక్ట్స్..?

ఇక రాజకుమారి కుందవై చోళుల కాలం నాటి రాజకీయాలు, రాజనీతితంత్రంపై ఆమెకున్న పట్టు మరొకరికి లేదు. చోళుల పాత రాజధాని అయిన పళయారై ప్యాలెస్‌ ఆమె రాజప్రసాదం. కుందవై పాత్రలో హీరోయిన్ త్రిష నటిస్తోంది. సుందర చోళుడి చిన్న కొడుకు అరుళ్‌మొళి వర్మన్ ను తమ తర్వాతి రాజుగా చోళ ప్రజలు భావిస్తుంటారు. ఇతడొక గొప్ప నాయకుడు అవుతాడని వారు అనుకుంటారు. ఇతడినే ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ అని కూడా పిలుస్తారు. జయం రవి అరుళ్‌మోళి వర్మన్‌గా మనకు కనిపిస్తాడు.

ఆదిత్య కరికాలన్‌కు అత్యంత నమ్మకస్తుడైన స్నేహితుడు వల్లవరాయన్‌. ఇతడు చోళులకు విధేయులుగా ఉండే బాన తెగకు చెందిన వాడు. ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ కథ వల్లవరాయన్‌తోనే మొదలై, అతడితోనే ముగుస్తుంది. పొన్నియిన్‌ సెల్వన్‌ ప్రపంచాన్ని మనకు పరిచయం చేసేది ఇతడే. వల్లవరాయన్‌ సమయస్ఫూర్తి కలవాడు, చమత్కారి కూడా. మనకు ఈ పాత్రలో హీరో కార్తి కనిపిస్తాడు. ఇక సినిమా కథను సరికొత్త మలుపు తిప్పే పాత్ర నందిని. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కావడం.. పెరియా పళవెట్టారియార్‌కు భార్యగా ఉండటం.. తన అందం, అభినయంతో ఎలాంటి మగవాడినైనా తన వశం చేసుకోగలదు. ఈ పాత్రలో అందాల భామ ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ నటిస్తోంది.

Ponniyin Selvan: “పొన్నియన్ సెల్వన్” హీరోల కన్నా ఐశ్వర్యరాయ్ రెమ్యూనిరేషన్ ఎక్కువట!

పళవేట్టురాయర్‌ వంశానికి చెందిన పెరియ పళవేట్టురాయర్ చోళ సామ్రాజ్యానికి కోశాధికారి. ఇతడికి చిన పెరియ పళవేట్టురాయర్ అనే తమ్ముడు ఉంటాడు‌. ఇతడు ఎలాగైనా రాజ్యాధికారం దక్కించుకోవాలని కుట్రలు పన్నుతుంటాడు. ఈ పాత్రలో మనకు నటుడు శరత్‌కుమార్ కనిపిస్తాడు. తంజావూరు కోటకు సేనాధిపతిగా ఉంటాడు చిన పళవేట్టురాయర్‌. ఇతడి అనుమతి లేకుండా సుందర చోళుడిని ఎవరూ కలవలేరు. ఈ పాత్రలో ఆర్‌.పార్తిబన్‌ నటించారు. ఇక పూంగుళలి అలియాస్‌ సముదిరై కుమారై పాత్రలో ఐశ్వర్యా లక్ష్మీ నటించింది. ఇందులో ఆమె పడవను నడిపే అమ్మాయిగా కనిపిస్తుంది. వల్లవరాయన్‌ వందిదేవన్‌, అరుళ్‌మోళి వర్మన్‌ ప్రాణాలను కాపాడే క్రమంలో ఈ అమ్మాయి తన ప్రాణాలు కోల్పోతుంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

చోళ సామ్రాజ్యపు గూఢచారిగా ఉన్న ఆళ్వార్‌ కడియాన్‌ నంబి, చోళ ప్రధాని అనిరుద్ధ బ్రహ్మయ్యర్‌ కోసం పని చేస్తుంటాడు. చోళ రాజ్యాన్ని కాపాడే క్రమంలో నంబి తరచూ వల్లవరాయన్‌ వందిదేవన్‌ను కలుస్తుంటాడు. ఈ పాత్రలో జయరామ్‌ కనిపించనున్నారు. వీరితో పాటు మధురాంతకుడుగా రెహమాన్‌, వానతిగా శోభితా ధూళిపాళ, పార్థిబేంద్ర పల్లవన్‌‌గా విక్రమ్‌ ప్రభు, వీరపాండ్యన్‌‌గా నాజర్‌, సెంబియన్‌ మహాదేవి‌గా జయచిత్రలతో పాటు ఇతర పాత్రలు కూడా మనకు ఈ సినిమాలో కనిపిస్తాయి.