Ponniyin Selvan 1: రికార్డులు చెరిపేస్తున్న మణిరత్నం సినిమా.. విజయ్ ఔట్.. కమల్ నెక్ట్స్..?

తమిళ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్ 1’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను హిస్టారికల్ ఫిక్షన్ మూవీగా అత్యంత భారీ స్థాయిలో చిత్ర యూనిట్ తెరకెక్కించింది. ఈ సినిమా ఇప్పటికే యూఎస్ ప్రీరిలీజ్ సేల్స్‌లో విజయ్ నటించిన బీస్ట్ చిత్ర రికార్డును అధిగమించి, దూసుకుపోతుంది.

Ponniyin Selvan 1: రికార్డులు చెరిపేస్తున్న మణిరత్నం సినిమా.. విజయ్ ఔట్.. కమల్ నెక్ట్స్..?

Ponniyin Selvan 1 Movie Creates Record With Surpassing Vijay Beast Movie

Ponniyin Selvan 1: తమిళ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్ 1’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను హిస్టారికల్ ఫిక్షన్ మూవీగా అత్యంత భారీ స్థాయిలో చిత్ర యూనిట్ తెరకెక్కించింది. ఇక ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ కూడా ఉండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, సెప్టెంబర్ 30న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ అప్పుడే పలు సంచనాలు క్రియేట్ చేస్తున్నాయి.

Ponniyin Selvan: “పొన్నియన్ సెల్వన్” హీరోల కన్నా ఐశ్వర్యరాయ్ రెమ్యూనిరేషన్ ఎక్కువట!

ముఖ్యంగా మణిరత్నం సినిమాలకు మంచి క్రేజ్ ఉన్న ఓవర్సీస్‌లో ఈ సినిమాను చూసేందుకు అక్కడి ఆడియెన్స్ ఆతృతగా ఉన్నారు. అయితే ఈ సినిమా అక్కడ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్‌లో దుమ్ములేపుతోంది. ఈ సినిమా ఇప్పటికే యూఎస్ ప్రీరిలీజ్ సేల్స్‌లో విజయ్ నటించిన బీస్ట్ చిత్ర రికార్డును అధిగమించి, దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా విజయ్ బీస్ట్ మూవీని ఓవర్ టేక్ చేయడంతో, మున్ముందు ఈ సినిమా కమల్ హాసన్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ విక్రమ్ రికార్డును కూడా అధిగమించడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

Ponniyin Selvan: మణిరత్నం సినిమాకు టికెట్ రేటు ఫిక్స్.. వర్కవుట్ అయ్యేనా..?

మరి మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమా ప్రీరిలీజ్ సేల్స్‌తోనే ఇన్ని రికార్డులు క్రియేట్ చేస్తుంటే, సినిమా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అనేది ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.