Ponniyin Selvan: మణిరత్నం సినిమాకు టికెట్ రేటు ఫిక్స్.. వర్కవుట్ అయ్యేనా..?

తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ప్రెస్టీజియస్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్’ పీరియాడికల్ సబ్జెక్ట్‌తో రానుంది. ఈ సినిమాను చోళుల కాలం నాటి కథాంశంతో తెరకెక్కించిన మణిరత్నం, ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడని చిత్ర యూనిట్ చెబుతోంది. కాగా, ఈ సినిమాను సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది. ఈ సినిమాకు హైదరాబాద్‌లోనూ భారీ రిలీజ్‌ను ప్లాన్ చేశాడు దిల్ రాజు. కానీ.. ఈ సినిమా టికెట్ రేట్ల విషయంలో మాత్రం ఆయన పాత పద్ధతినే అవలంబిస్తున్నారు.

Ponniyin Selvan: మణిరత్నం సినిమాకు టికెట్ రేటు ఫిక్స్.. వర్కవుట్ అయ్యేనా..?

Ticket Prices For Ponniyin Selvan Locked In Hyderabad

Ponniyin Selvan: తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ప్రెస్టీజియస్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్’ పీరియాడికల్ సబ్జెక్ట్‌తో రానుంది. ఈ సినిమాను చోళుల కాలం నాటి కథాంశంతో తెరకెక్కించిన మణిరత్నం, ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక భారీ బడ్జెట్ మూవీగా ఈ సినిమాను ఆయన తెరకెక్కించిన తీరు అత్యద్భుతంగా ఉండబోతుందని చిత్ర నటీనటులు, టెక్నీషియన్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

Ponniyin Selvan: రన్‌టైమ్ లాక్ చేసుకున్న మణిరత్నం సినిమా.. ఎంతో తెలుసా?

ఇప్పటికే ఈ సినిమాను తెలుగులో ప్రమోట్ చేస్తున్న తీరు చూస్తుంటే, ఈ సినిమాకు ఇక్కడ కూడా మంచి ఆదరణ దక్కడం ఖాయమని అందరూ అనుకుంటున్నారు. అయితే ఈ సినిమాను తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడు. కాగా, ఈ సినిమాను సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది. ఈ సినిమాకు హైదరాబాద్‌లోనూ భారీ రిలీజ్‌ను ప్లాన్ చేశాడు దిల్ రాజు. కానీ.. ఈ సినిమా టికెట్ రేట్ల విషయంలో మాత్రం ఆయన పాత పద్ధతినే అవలంబిస్తున్నారు.

Ponniyin Selvan: పొన్నియిన్ సెల్వన్ ఆడియో లాంచ్ కు ఆ ఇద్దరు స్టార్ హీరోలు..

ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తుండటంతో ఈ చిత్రానికి హైదరాబాద్‌లో టికెట్ రేటును ఏకంగా రూ.295 గా నిర్ణయించారు. ఇది తెలంగాణ సర్కార్ నిర్ణయించిన టికెట్ రేట్లలో అత్యధిక మార్క్‌గా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. మరి మణిరత్నం సినిమాకు ఈ స్థాయిలో టికెట్ రేట్లు పెట్టడం ఎంత వరకు వర్కవుట్ అవుతుందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ భారీ టికెట్ రేట్లతో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయడంతో ఈ సినిమాను ఎంతమంది చూసేందుకు ఆసక్తిని చూపుతారనేది అందరిలో ఆసక్తిని క్రియేట్ చేసింది.