Ponniyin Selvan: పొన్నియిన్ సెల్వన్ ఆడియో లాంచ్ కు ఆ ఇద్దరు స్టార్ హీరోలు..

తమిళ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ పొన్నియిన్ సెల్వన్ విడుదలకు సిద్ధమవుతోంది. కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియిన్ సెల్వన్ అనే నవల ఆధారంగా ఈ చిత్రం రెండు భాగాలుగా వస్తున్నట్టు తెలిసిందే. కాగా ఈ చిత్రం ఈ నేల(సెప్టెంబర్) 30న ప్రేక్షకుల ముందుకు వస్తుండడంతో చిత్ర యూనిట్ ఈ మంగళవారం ఆడియో లాంచ్ ఈవెంట్ చెన్నై వేదికగా జరుపుకుంటుంది.

Ponniyin Selvan: పొన్నియిన్ సెల్వన్ ఆడియో లాంచ్ కు ఆ ఇద్దరు స్టార్ హీరోలు..

Rajini Kanth and Kamala Hasan are Chief Guests for Ponniyin Selvan Audio launch

Ponniyin Selvan: తమిళ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ పొన్నియిన్ సెల్వన్ విడుదలకు సిద్ధమవుతోంది. కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియిన్ సెల్వన్ అనే నవల ఆధారంగా ఈ చిత్రం రెండు భాగాలుగా వస్తున్నట్టు తెలిసిందే. 1000 సంత్సరాల కిందట ఇప్పటి తమిళనాడుని కేంద్రంగా చేసుకుని ఎన్నో రాజ్యాలని పాలించిన రాజరాజ చోళుడి పాలనకు ముందు జరిగిన కథ ఇది.

Chiyaan Vikram : పాన్ ఇండియా రైటర్ విజయంద్ర ప్రసాద్ కథలో చియాన్ విక్రమ్..నిజమెంత?

తమిళంలో ఎంతో ఫేమస్ అయిన ఈ నవలని ఒకప్పటి హీరో, ప్రజానాయకుడు “ఎంజేర్”తో పాటు ఎందరో ఈ సినిమా చేద్దామనుకున్నప్పటికీ అవి కలలుగానే మిగిలిపోయాయి. కానీ మణిరత్నం ఆ కలని నేరవేర్చుకున్నాడు. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య, త్రిష వంటి నటీనటులు నటిస్తున్నారు. AR రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు.

Mani Ratnam’s PS1: డ్రీమ్ ప్రాజెక్ట్ పీఎస్-1 రిలీజ్ డేట్ ప్రకటించిన మణిరత్నం

కాగా ఈ చిత్రం ఈ నేల(సెప్టెంబర్) 30న ప్రేక్షకుల ముందుకు వస్తుండడంతో చిత్ర యూనిట్ ఈ మంగళవారం ఆడియో లాంచ్ ఈవెంట్ చెన్నై వేదికగా జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలోని పాటలతో పాటు ట్రైలర్ కూడా విడుదల చేయబోతున్నట్టు అలానే ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్, యూనివర్సల్ హీరో కమల్ హాసన్ రాబోతున్నట్టు ఒక వీడియోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.