పూజా హెగ్డే.. ఫుల్ ఖుష్ అవుతోంది..

Pooja Hegde: పూజా హెగ్డే.. టాలీవుడ్‌లోనే కాదు.. బాలీవుడ్‌లో కూడా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఈ హాట్ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఏ ముహూర్తాన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చానో కానీ నా కోరికలన్నీ తీరిపోతున్నాయ్ అంటూ తెగ ఆనందపడిపోతోందీ ముద్దుగుమ్మ. ఇంతకీ పూజా ఎందుకంత ఆనందపడుతోందో తెలుసా..?
కెరీర్ స్టార్టింగ్‌లో ఎవరూ పెద్దగా పట్టించుకోకపోయినా.. అసలు ఏమాత్రం డిజప్పాయింట్ అవ్వకుండా తన టైమ్ కోసం వెయిట్ చేసింది పూజా హెగ్డే . హిందీలో పెద్దగా క్లిక్ అవ్వకపోవడంతో సౌత్ మీద బాగా కాన్సన్‌ట్రేట్ చేసింది.దెబ్బకి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్‌తో అందరి స్టార్ హీరోల సరసన నటిస్తూ.. స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్రజెంట్ అటు బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలతో పూజా ఫుల్ బిజీగా ఉంది. అంతేకాదు నా కోరికలన్నీ తీరిపోతున్నాయ్ అంటూ తెగ ఆనందపడిపోతోంది..
https://10tv.in/shooting-spot-pics-from-rang-de-and-bob-biswas/
బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా.. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా మంచి ఇమేజ్ సంపాదించుకుంది. తెలుగులో ఎన్టీఆర్‌తో ‘అరవింద సమేత’ చేసి బంపర్ హిట్ కొట్టిన పూజా.. మహేష్ బాబుతో ‘మహర్షి’ సినిమా చేసింది. బన్నీతో ‘అల.. వైకుంఠపురము’ లో సినిమా చేసి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది..ఇదే సక్సెస్‌తో ప్రభాస్‌తో జాన్ సినిమాతో పాటు అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా కూడా చేస్తూ.. తెలుగులో ఫుల్ బిజీగా ఉంది. త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ చేస్తున్న ‘అయినను పోయి రావలె హస్తినకు’ సినిమాలో హీరోయిన్‌గా పూజనే తీసుకోనున్నారని తెలుస్తోంది.
టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌లో కూడా బిజీ అయిపోతోంది ఈ క్యూట్ హీరోయిన్. స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో ‘మొహంజోదారో’ మూవీ చేసిన పూజ.. లాస్ట్ ఇయర్ ‘హౌస్‌ఫుల్ 4’ సినిమాతో అక్షయ్ కుమార్ సరసన సూపర్ హిట్ కొట్టింది.ఆ సినిమాతో అందరినీ ఎంటర్‌టైన్ చేసిన పూజకి స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన నెక్ట్స్ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు.. సల్మాన్ ఖాన్ త్వరలో చెయ్యబోతున్న ‘కభీ ఈద్.. కభీ దివాళి’ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసి అందరినీ సర్‌ప్రైజ్ చేసింది పూజా.
వరుస పెట్టి స్టోరీలు వింటున్న పూజా.. అలా సల్మాన్ ఖాన్ సినిమా ఓకే అయ్యిందో లేదో .. మళ్లీ రీసెంట్‌గా అక్షయ్ కుమార్ సినిమాకు కూడా సెలక్ట్ అయ్యింది. అక్షయ్ కుమార్ హీరోగా చేస్తున్న ‘బచ్చన్ పాండే’
సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా పూజ ఫిక్స్ అయింది.
ఇలా బాలీవుడ్‌లో ఫుల్ బిజీగా ఉందీ ముద్దుగుమ్మ. బాలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరోలందరితో సినిమాలు చేస్తూ.. ఏ ఉద్దేశ్యంతో ఇండస్ట్రీకి వచ్చానో అవన్నీ తీరిపోతున్నాయి.. నా లైఫ్‌లో ఈ ఫేజ్ చాలా హ్యపీయెస్ట్ అంటూ తెగ ఆనందపడిపోతోంది పూజా హెగ్డే.