వాల్మీకి లో పూజా లుక్ అదుర్స్

హరీశ్ శంకర్ డైరక్షన్ లో మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘వాల్మీకి’. తమిళ్ లో హిట్ అయిన ‘జిగర్తాండా’ సినిమాకు రిమేక్‌గా వస్తోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. ఆదివారం (ఆగస్ట్ 25, 2019) పూజా హెగ్డే ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసింది మూవీ టీమ్.
సైకిల్ తొక్కుతున్న ఫోజులో పూజ లుక్ అదుర్స్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. పల్లెటూరి అమ్మాయిలా..లంగా ఓనీ వేసుకుని..రెండు జడలతో…అమాయకంగా సైకిల్ తొక్కుతూ దిక్కులూ చూస్తుూ ఉన్న పూజ లుక్ సూపర్ అంటూ ప్రశంసిస్తున్నారు. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అథర్వ మురళి, మృణాళినీ రవి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 13,2019న విడుదల కానుంది.
పూజా హెగ్డే ఆరేళ్ల క్రితమే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో కలిసి ‘ముకుందా’ సినిమాలో నటించింది. ఆ సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక ఇప్పుడు మరోసారి మెగా ప్రిన్స్ తో ‘వాల్మీకి’ సినిమా చేస్తోంది.