తండ్రి కోసం పూజా హెగ్డే విస్కీతో ఏం చేసిందో తెలుసా!

Pooja Hegde makes a cocktail for her father: లాక్‌డౌన్ కారణంగా సినిమా వాళ్లకు ఎప్పుడూలేనంత ఫ్రీ టైం దొరికింది. ఈ సమయాన్ని ఎవరెవరు ఎలా ఉపయోగిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మెల్లగా కొన్ని షూటింగులు ప్రారంభమవుతున్నాయి. అయితే హాట్ బ్యూటీ పూజా హెగ్డే నటిస్తున్న సినిమాలేవీ ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు.
ఈ విరామం సమయంలో పూజా చెఫ్‌గా మారిపోయింది. వంటగదిలో ప్రయోగాలు చేస్తూ సరికొత్త వంటకాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది. ఆ వీడియోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేయడం చూస్తూనే ఉన్నాం.
ఇప్పుడు తన తండ్రి కోసం పూజా మరోసారి చెఫ్ అవతారం ఎత్తింది. తన తండ్రి కోసం స్పెషల్ డిష్ (జానీ టామరిండ్ హై బాల్)ను తయారు చేసింది. దాని తయారీ విధానాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంట్లో ఆల్కహాల్‌ను(జానీ వాకర్ విస్కీ) కూడా ఉపయోగిస్తున్నందున కాస్త బాధ్యతతో వ్యవహరించాలని సూచించింది.
అలాగే తండ్రితో కలిసి ఉన్న పిక్ కూడా షేర్ చేసింది. సినిమాల విషయానికివస్తే.. రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ‘రాధేశ్యామ్’, యంగ్ హీరో అఖిల్ అక్కినేని పక్కన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలు పూజా చేతిలో ఉన్నాయి.