దర్శకుడి చెల్లెల్ని పెళ్లాడుతున్న కమెడియన్
కోలీవుడ్ స్టార్ కమెడియన్ సతీష్ ‘సిక్సర్’ సినిమా దర్శకుడు చెల్లెలు సింధుని వివాహం చేసుకోబోతున్నాడు.. నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది..

కోలీవుడ్ స్టార్ కమెడియన్ సతీష్ ‘సిక్సర్’ సినిమా దర్శకుడు చెల్లెలు సింధుని వివాహం చేసుకోబోతున్నాడు.. నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది..
కోలీవుడ్ స్టార్ కమెడియన్ సతీష్ నిశ్చితార్థ వేడుక కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది. తమిళనాట ప్రస్తుతం స్టార్ కమెడియన్స్‌లో సతీష్ ముత్తుకృష్ణన్ బాగా పాపులర్. ఏడాదికి మినిమమ్ 10 సినిమాలు చేస్తూ యాక్టర్‌గా తన క్రేజ్‌ని పెంచుకుంటున్నాడు. హీరో శివ కార్తికేయన్‌కి మిత్రుడిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సతీష్ ఇప్పుడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు.
తమిళ్ డైరెక్టర్ చెల్లెలితో ఇటీవల సతీష్ నిశ్చితార్థం జరిగింది. కొన్ని నెలల క్రితం వైభవ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సిక్సర్’ సినిమా తమిళ్ బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో సతీష్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. అయితే ఆ సినిమా దర్శకుడు చాచి సిస్టర్ సింధుని సతీష్ వివాహం చేసుకోబోతున్నాడు.
Read Also : నాగ చైతన్య 19 లుక్ వచ్చేసింది!
ఇటీవల సింధు ఇంట్లో సింపుల్‌గా వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది. ఇక డిసెంబర్‌లో వీరి పెళ్లి వేడుకను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా సతీష్ వివాహంపై వస్తున్న రూమర్స్‌కి ఫైనల్ గా ఒక క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం ఈ కమెడియన్ 12కి పైగా సినిమాల్లో నటిస్తున్నాడు.