Kovai Sarala : కోవై సరళ గుర్తుందా? ఇప్పుడు ఎలా మారిపోయిందో చూడండి.. చాలా ఏళ్ళ తర్వాత హైదరాబాద్‌లో..

తాజాగా నిన్న రాత్రి హైదరాబాద్ లో బాక్(అరుణ్‌మనై 4) ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కుష్బూ, తమన్నా, రాశిఖన్నాతో పాటు కోవై సరళ కూడా వచ్చారు.

Kovai Sarala : కోవై సరళ.. ఈ పేరు వినగానే బ్రహ్మానందంతో కలిసి చేసిన కామెడీనే గుర్తొస్తుంది. తెలుగులో బ్రహ్మానందం – కోవై సరళ జంటగా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులని నవ్వించి మెప్పించారు. తమిళనాడుకి చెందిన కోవై సరళ తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో కొన్ని వందల సినిమాల్లో నటించారు. తెలుగులో బెస్ట్ ఫిమేల్ కమెడియన్ గా ఇరవై ఏళ్ళ పాటు సాగారు.

ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తుంది కోవై సరళ. బయట ఈవెంట్స్, సోషల్ మీడియాలో కూడా ఎక్కడా ఎక్కువగా కనిపించట్లేదు. తెలుగులో చివరిసారిగా 2015లో కిక్ 2 సినిమాలో కనిపించింది కోవై సరళ. ఆ తర్వాత నాలుగు డబ్బింగ్ సినిమాలతో పలకరించింది. మళ్ళీ ఇప్పుడు మరో డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించనుంది కోవై సరళ. తమిళ్ లో సూపర్ హిట్ హారర్ కామెడీ సిరీస్ అరణ్‌మనై కి నాలుగో సీక్వెల్ రాబోతుంది. తమిళ్ లో అరణ్‌మనై 4 గా రాబోతున్న ఈ సినిమా తెలుగులో ‘బాక్’ గా రిలీజ్ కాబోతుంది.

Also Read : Shyamala Devi : మహేష్ బాబుతో ప్రభాస్ పెద్దమ్మ.. సితారని ఆశీర్వదించి, మహేష్‌తో ఫోటో దిగి.. వైరల్ అవుతున్న వీడియో..

కుష్బూ నిర్మాణంలో, కుష్బూ భర్త మెయిన్ లీడ్ చేస్తూ ఆయన దర్శకత్వంలోనే ఈ అరణ్‌మనై 4 సినిమా తెరకెక్కింది. రాశిఖన్నా, తమన్నా ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మే 3న తమిళ్, తెలుగు భాషల్లో అరణ్‌మనై 4 సినిమా రిలిజ్ కాబోతుంది. తాజాగా నిన్న రాత్రి హైదరాబాద్ లో బాక్(అరణ్‌మనై 4) ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కుష్బూ, తమన్నా, రాశిఖన్నాతో పాటు కోవై సరళ కూడా వచ్చారు..

కోవై సరళ చాలా మారిపోయారు. ఏజ్ పెరిగిపోవడంతో ముఖంలో ఆ ఛాయలు కనిపిస్తున్నాయి. హెయిర్ కట్ తో కళ్లజోడు పెట్టుకొని కనిపించారు. బాక్ ఈవెంట్ నుంచి కోవై సరళ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. కోవై సరళ చాలా మారిపోయింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఎంత మారిపోయినా అదే సరదా, అల్లరి, కామెడీతో నిన్న ఈవెంట్లో అందర్నీ నవ్వించారు. తెలుగులో తన పాపులర్ కామెడీ డైలాగ్స్ చెప్పి అలరించారు కోవై సరళ. మళ్ళీ ఆమె తెలుగులో వరుసగా సినిమాలు చేయాలని తెలుగు ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు