Shyamala Devi : మహేష్ బాబుతో ప్రభాస్ పెద్దమ్మ.. సితారని ఆశీర్వదించి, మహేష్‌తో ఫోటో దిగి.. వైరల్ అవుతున్న వీడియో..

తాజాగా మహేష్ బాబు నమ్రత, సితారతో కలిసి హైదరాబాద్ లో ఓ పెళ్ళికి హాజరయ్యారు. ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి కూడా ఈ పెళ్ళికి హాజరయ్యారు.

Shyamala Devi : మహేష్ బాబుతో ప్రభాస్ పెద్దమ్మ.. సితారని ఆశీర్వదించి, మహేష్‌తో ఫోటో దిగి.. వైరల్ అవుతున్న వీడియో..

Prabhas Aunty Shyamala Devi Meets Mahesh Babu Family in a Wedding Video goes Viral

Updated On : April 29, 2024 / 7:07 AM IST

Mahesh Babu – Shyamala Devi : సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో హిట్ కొట్టాడు. త్వరలో రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో మహేష్ భారీ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మహేష్ ఆల్రెడీ జుట్టు పెంచుతూ సరికొత్త లుక్ లోకి మారుతున్నాడు. దీంతో ఇటీవల మహేష్ బాబు ఎక్కడ కనపడినా మహేష్ ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

తాజాగా మహేష్ బాబు నమ్రత, సితారతో కలిసి హైదరాబాద్ లో ఓ పెళ్ళికి హాజరయ్యారు. ఈ పెళ్ళికి అనేకమంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. ప్రభాస్(Prabhas) పెద్దమ్మ శ్యామల దేవి కూడా ఈ పెళ్ళికి హాజరయ్యారు. శ్యామలాదేవి మహేష్ ని చూడగానే దగ్గరికి వెళ్లి ఆప్యాయంగా పలకరించి ఫోటో తీసుకుంది. అలాగే నమ్రతని కౌగలించుకొని పలకరించింది. సితార తలపై చెయ్యి పెట్టి ఆశీర్వదించింది శ్యామలాదేవి.

Also Read : Mahesh Babu – Manjula : ఏంట్రా జుట్టు ఇంత పెంచావ్.. అక్కతో మహేష్ బాబు క్యూట్ వీడియో చూశారా?

మహేష్ ఫ్యామిలీతో కాసేపు ముచ్చటించింది ప్రభాస్ పెద్దమ్మ. దీంతో మహేష్ ఫ్యామిలీతో శ్యామలాదేవి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మహేష్ అభిమానులు, ప్రభాస్ అభిమానులు ఈ వీడియోల్ని తెగ షేర్ చేస్తున్నారు. ఇక కొంతమంది ఈ వీడియోలు షేర్ చేస్తూ.. వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు, ఫ్యాన్స్ కొట్టుకోడాలు, తిట్టుకోడాలు, హీరోల మీద ట్రోల్స్ ఆపేసి బాగుండాలి అని పోస్టులు చేస్తున్నారు.