Mahesh Babu – Manjula : ఏంట్రా జుట్టు ఇంత పెంచావ్.. అక్కతో మహేష్ బాబు క్యూట్ వీడియో చూశారా?

తాజాగా మహేష్ తన ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ లో ఓ పెళ్ళికి హాజరయ్యాడు. ఈ పెళ్ళికి మహేష్ బాబు అక్క మంజుల ఘట్టమనేని కూడా వచ్చింది.

Mahesh Babu – Manjula : ఏంట్రా జుట్టు ఇంత పెంచావ్.. అక్కతో మహేష్ బాబు క్యూట్ వీడియో చూశారా?

Mahesh Babu and his Sister Manjula Ghattamaneni Cute Video goes Viral

Updated On : April 29, 2024 / 6:24 AM IST

Mahesh Babu – Manjula : మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి(Rajamouli) సినిమా కోసం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా కోసం జుట్టు బాగా పెంచుతూ, బాడీ మీద కూడా ఫోకస్ చేస్తూ స్పెషల్ గా రెడీ అవుతున్నాడు. ఇటీవల మహేష్ బాబు ఫోటోలు, వీడియోలు లీక్ అయితే మహేష్ లుక్ బాగా వైరల్ అవుతుంది. తాజాగా మహేష్ తన ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ లో ఓ పెళ్ళికి హాజరయ్యాడు.

ఈ పెళ్ళికి పలువురు సినీ ప్రముఖులు కూడా విచ్చేశారు. ఈ పెళ్ళికి మహేష్ బాబు అక్క మంజుల ఘట్టమనేని కూడా వచ్చింది. మంజుల మహేష్ బాబుని చూడగానే ఆ జుట్టు ఏంటి ఇంత పెంచేసావు అన్నట్టు జుట్టు పట్టుకొని మరీ చూసింది. కాసేపు వీళ్లిద్దరి మధ్య సరదా సంభాషణ జరిగింది. మంజుల, మహేష్ నవ్వుతూ మాట్లాడుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read : Rajamouli : రాజమౌళికి అలా పిలిస్తే ఇష్టమంట.. కీరవాణి కొడుకులు రాజమౌళిని ఏమని పిలుస్తారో తెలుసా?

దీంతో మహేష్ అభిమానులు ఈ క్యూట్ వీడియోని మరింత షేర్ చేస్తున్నారు. అక్కాతమ్ముళ్ల సరదా సంభాషణ చూసి, అది కూడా రాజమౌళి సినిమా గురించి పెంచుతున్న జుట్టు గురించే మాట్లాడుకుంటున్నట్టు ఈ వీడియో ఉండటంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇక రాజమౌళి సినిమా ఎప్పుడు మొదలుపెడతారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి – మహేష్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్టు సమాచారం.