Rajamouli : రాజమౌళికి అలా పిలిస్తే ఇష్టమంట.. కీరవాణి కొడుకులు రాజమౌళిని ఏమని పిలుస్తారో తెలుసా?

తాజాగా శ్రీసింహ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలని తెలుపుతూ రాజమౌళి గురించి కూడా మాట్లాడారు.

Rajamouli : రాజమౌళికి అలా పిలిస్తే ఇష్టమంట.. కీరవాణి కొడుకులు రాజమౌళిని ఏమని పిలుస్తారో తెలుసా?

Keeravani Childrens Calling Rajamouli with That Name

Rajamouli : బాహుబలి సినిమాతో ఇండియాలోనే టాప్ డైరెక్టర్స్ లో ఒకరు అయ్యారు రాజమౌళి. ఇక RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకు గుర్తింపు తెచ్చి, ఏకంగా ఆస్కార్ అవార్డు సాధించి సరికొత్త చరిస్త్ర సృష్టించారు. రాజమౌళి నెక్స్ట్ సినిమా కోసం ఇప్పుడు ప్రపంచంలోని సినీ ప్రేమికులంతా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి వర్క్ లో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారో ఫ్యామిలీతో ఉన్నప్పుడు అంతే సరదాగా ఉంటారని తెలిసిందే.

కీరవాణి చిన్న కొడుకు శ్రీ సింహ(Sri Simha) ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా శ్రీసింహ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలని తెలుపుతూ రాజమౌళి గురించి కూడా మాట్లాడారు.

Also Read : Samantha : నిర్మాతగా సమంత ఫస్ట్ మూవీ అనౌన్స్.. ‘మా ఇంటి బంగారం’ అంటూ.. బర్త్‌డే స్పెషల్ పోస్టర్..

శ్రీసింహ మాట్లాడుతూ.. రాజమౌళిని బాబా అని పిలుస్తాము. రాజమౌళి మాకు బాబాయ్ అవుతాడు. దాంట్లో షార్ట్ కట్ గా బాబా. అలా పిలిస్తే ఆయనకు ఇష్టం. బాబా అని పిలవమని ఆయనే మాకు చెప్పారు. మేమంతా ఆయన్ని బాబా అనే పిలుస్తాము అని తెలిపారు. మరి రాజమౌళి ఇకపై ఈవెంట్స్ లో, బయట కనిపిస్తే బాబా అని పిలుస్తారేమో అభిమానులు చూడాలి.